Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్.. లక్కు మాములుగా లేదు!
ఇండస్ట్రీలో సక్సెస్ కొడితే ఎవరైనా సరే చాలా ఈజీగా ఛాన్సులు అందుకుంటారు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కు కూడా గ్యాప్ లేకుండా ఆఫర్స్ చాలా వస్తున్నాయట. అయితే ఈ మెగా హీరో మాత్రం చాలా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ముందుగా కథ సెట్టయితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఉప్పెన అనంతరం క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేసిన విషయం తెలిసిందే.
వైష్ణవ్ తేజ్ అదృష్టం ఇప్పుడు మామూలుగా లేదు. యావరేజ్ దర్శకులతో పాటు బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకులు కూడా అతనితో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ను డైరెక్ట్ చేసిన గిరిషయ ఒక సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా పూర్తవ్వకముందే వైష్ణవ్ ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ తోనే మరో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
Recommended Video
అందులో ఒక సినిమాకు కొత్త దర్శకుడు ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక మరో సినిమా కోసం వెంకీ కుడుములను ఫిక్స్ చేసినట్లు సమాచారం. వెంకీ మైత్రి మూవీ మేకర్స్ లోనే సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో పెద్ద హీరోతో వర్క్ చేయాలని అనుకున్నారు. కానీ అందరూ ఇప్పుడు బిజీగా ఉండడంతో వైష్ణవ్ తోనే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.