'ఉప్పెన'లా పెరుగుతున్న డిమాండ్.. ఆ రెండు భాషల్లో రీమేక్.. హీరోలు ఎవరంటే?

ఇప్పటివరకు 2021 టాలీవుడ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఉప్పెన మొదటి స్థానంలో కొనసాగుతోంది. 70కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై పక్క ఇండస్ట్రీలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మాస్ రాజా రవితేజ క్రాక్ కంటే కూడా అత్యదిక ప్రాఫిట్స్ ను కేవలం నాలుగు రోజుల్లోనే అందుకుంది. ఉప్పెన సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక సినిమాను తమిళ్, బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మలయాళీ ముద్దుగమ్మగా సన్నీలియోన్.. కేరళ కుట్టిగా అందంతో ఆకట్టుకొంటూ

మొదట డబ్ చేయాలని ప్రయత్నాలు..

మొదట డబ్ చేయాలని ప్రయత్నాలు..

స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టూడెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా మేకింగ్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు చేసినట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదట తమిళ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారట. విజయ్ సేతుపతికి అక్కడ భారీగా క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా సినిమా క్లిక్కవుతుందని తమిళ్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

ఎందుకు వద్దన్నారంటే?

ఎందుకు వద్దన్నారంటే?

విజయ్ సేతుపతి అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఉప్పెన సినిమాలో ఉప్పడ బీచ్ బ్యాక్ డ్రాప్ లో అక్కడి వారి జీవిన శైలి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన విషయం తెలిసిందే. అయితే తమిళ్ లో సముద్రపు ఒడ్డున జీవించే వారి లైఫ్ మరొక విధంగా ఉంటుంది. పైగా ఉప్పెన లాంటి కథను వారి వాతావరణానికి తగ్గట్లు తెరపైకి తెస్తేనే బావుంటుందని, అందుకే డబ్ చేయవద్దని సలహా ఇచ్చారట.

తమిళ్ లో ఫిక్స్ అయినట్లే?

తమిళ్ లో ఫిక్స్ అయినట్లే?

మంచి కథ కాబట్టి అనవసరంగా డబ్ చేసి వృధా చేయవద్దని సుకుమార్ కూడా ఆలోచించినట్లు సమాచారం. ఇక విజయ్ సేతుపతి ఈ సినిమా తమిళ్ రైట్స్ పై కన్నేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఎందుకంటే కోలీవుడ్ స్టార్ హీరో తనయుడి ఎంట్రీకి ఆ కథ కరెక్ట్ గా సరిపోతుందట. అతను మరెవరో కాదు. తలపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

హిందీలో ఎవరంటే?

హిందీలో ఎవరంటే?

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉప్పెన సినిమా హాట్ టాపిక్ గా మారినట్లు టాక్. ఒక బడా ప్రొడ్యూసర్ సినిమా హిందీ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఇక ఇషాన్ ఖాతార్, అనన్య పాండే నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హీరో విషయంలో అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నారట. హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోలేదని టాక్ వస్తోంది. మరి హిందీలో సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X