వైష్ణవ్ తేజ్ ఉప్పెన క్లైమాక్స్.. ప్రేక్షకులు ఒప్పుకుంటారా?
హీరోలకు కేరాఫ్ అడ్రస్‌గా మెగాఫ్యామిలీ నిలుస్తోంది. ఇప్పటికే అరడజను హీరోలు ఈ ఫ్యామిలీ నుంచి అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి ఉప్పెన అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మాస్ మసాలా అంశాలకు పోకుండా, రా నెరేషన్‌లోనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. మత్స్యకారుల జీవన శైలి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయమేంటంటే.. ఇదో యదార్థ సంఘటన అని టాక్ వినిపస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు ఇలాంటి మత్స్యకారుల నేపథ్యం నుంచి వచ్చినవాడే. తన ఊర్లో జరిగిన ఓ సంఘటననే కథగా రాసుకున్నాడని తెలుస్తోంది.

ఈ మూవీ క్లైమాక్స్‌లో అయితే.. తెలుగు సినిమా పరిమితుల్ని, పరిధుల్నీ దాటుకుని తీశాడని తెలుస్తోంది. క్లైమాక్స్ విన్నాక.. సుకుమారే షాకైపోయాడని సమాచారం. ఇది ఓ మత్యకారుడి ప్రేమకథ. ప్రేమ సన్నివేశాలు సరికొత్తగా ఉండబోతున్నాయని, క్లైమాక్స్‌లో అయితే.. ఓ షాక్ తగలక తప్పదని తెలుస్తోంది. ఓ రకంగా ఇది యాంటీ క్లైమాక్స్. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటోన్న నేపథ్యంలో ఉప్పెన విజయం సాధిస్తుందా? లేదా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











