ఉప్పెన రిలీజ్ డేట్.. మొత్తానికి ఒక ప్లాన్ సెట్ చేసుకున్న నిర్మాతలు
టాలీవుడ్ కొత్త హీరో వైష్ణవ్ తేజ్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు అప్పుడే బిజీ హీరోగా మారిపోయాడు. పూర్తి చేసిన ఉప్పెన సినిమా అనుకోని విధంగా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏదో ఆర్థిక కారణాల వల్ల సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా విడుదల ఆలస్యం అయినట్లుగానే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమా కూడా మరో కారణంతో వాయిదా పడింది. ఇద్దరి అన్నదమ్ముల మొదటి సినిమాలు ఇలానే అవ్వడంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే సినిమా రిజల్ట్ విషయంలో మాత్రం వైష్ణవ్ తేజ్ హిట్టు కొట్టేలా ఉన్నాడనిపిస్తోంది. సాయి రేయ్ సినిమా ఆలస్యంగా విడుదలైనప్పుటికీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఉప్పెన మాత్రం సుకుమార్ టీమ్ నుంచి వస్తోంది కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. దర్శకుడు బుచ్చి బాబు సుకుమార్ వద్ద చాలా కాలంగా పనిచేస్తున్నాడు. మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఆ దర్శకుడికి కొన్ని ఆఫర్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఉప్పెన సినిమాను వచ్చే నెల విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే థియేటర్స్ లో కొన్ని పాత సినిమాలను అలాగే ఓటీటీలో విడుదలైన సినిమాలను రిలీజ్ చేయనున్నారట.
వాటికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓటీటీ ఆఫర్స్ వచ్చినప్పటికీ సుకుమార్ అందుకు ఒప్పుకోలేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైష్ణవ్ కెరీర్ ని రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక దర్శక నిర్మాతలు ఓటీటీ ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఉప్పెనను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











