వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్.. మరోసారి చర్చలు జరుపుతున్న అమెజాన్ ప్రైమ్.. కాస్త ముందుగానే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. చాలా కాలం తరువాత ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సాలీడ్ హిట్ అందుకున్నాడనే చెప్పాలి. ఒక విధంగా సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సినిమా రిజల్ట్ తో హ్యాపీగానే ఉన్నారు. ఇక సినిమా ఓటీటీ రిలీజ్ పై కూడా ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. కాస్త ముందుగానే అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

ఒరిజినల్ కథ కంటే కూడా

ఒరిజినల్ కథ కంటే కూడా

పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ ఒక విధంగా ఒరిజినల్ కథ కంటే కూడా బాగా వచ్చిందని చాలా మంది బడా దర్శకులు కామెంట్ చేశారు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరు కూడా సినిమాపై ఒక లుక్కేశారు. మహేష్ బాబు పాజిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

రికార్డుల డోస్ మరోలా ఉండేది

రికార్డుల డోస్ మరోలా ఉండేది

పింక్ సినిమాలో అసలు కథను ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా దర్శకుడు వేణు శ్రీరామ్, పవన్ కళ్యాణ్ ను అద్భుతంగా చూపించాడు. ఇక ఈ దర్శకుడు ఒక్కసారిగా అగ్ర దర్శకుల లిస్టులో చేరిపోయాడని చెప్పవచ్చు. కరోనా వ్యాప్తి ఎక్కువవ్వడం వలన కలెక్షన్స్ కాస్త తగ్గాయి. లేకపోతే రికార్డుల డోస్ మరోలా ఉండేది.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ ఫోటోషూట్ వైరల్.. సరికొత్త అందాలతో

 ఓటీటీ రిలీజ్..

ఓటీటీ రిలీజ్..

ఇక కరోనా వైరస్ రోజురోజుకు మరింత ఎక్కువవ్వడంతో థియేటర్స్ దాదాపు క్లోజ్ అవుతున్నాయి. 50% ఆక్యుపెన్సీలలో పెద్దగా లాభం లేకపోయే సరికి ఎవరు కూడా సినిమాలను రిలీజ్ చేయడానికి ఇష్ట పడటం లేదు. ఇక వకీల్ సాబ్ కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక ఆ అవకాశాన్ని ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఉపయోగించుకోవాలని చూస్తోంది.

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
వచ్చే నెలలోనే..

వచ్చే నెలలోనే..

అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అసలైతే అగ్రిమెంట్ ప్రకారం 50రోజుల తరువాతే అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఇప్పుడు కరోనా వల్ల థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో వచ్చే నెల సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఓటీటీ డీల్స్ విషయంపై మరోసారి దిల్ రాజుతో చర్చలు జరిపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X