Bhola Shankar: చిరంజీవి మూవీలో వకీల్ సాబ్.. ఒక్క డైలాగ్‌తో సర్‌ప్రైజ్ చేసేలా ప్లాన్
అరవై ఏళ్లు దాటినా కుర్ర హీరోలకు ధీటుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆయన ఏడాదికి కనీసం రెండు సినిమాలనైనా చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం 'వాల్తేరు వీరయ్య' అనే మూవీతో వచ్చి.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఆయన ఉత్సాహం రెట్టించిందనే చెప్పాలి. ఈ జోష్‌లోనే ఇప్పుడు చిరంజీవి.. 'భోళా శంకర్' సినిమాను చేస్తోన్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోన్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'భోళా శంకర్' మూవీని మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఈ చిత్రాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ రూపొందిస్తున్నాడు. ఇక, ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో ఈ మూవీ నుంచి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'భోళా శంకర్'లో వకీల్ సాబ్ అంటూ ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతోంది.

'భోళా శంకర్' మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె లాయర్ పాత్రను చేస్తున్నట్లు ఇటీవలే కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో తమన్నా 'వకీల్ సాబ్' మూవీలో పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌ను అనుకరిస్తుందట. అంతేకాదు, 'అబ్జెక్షన్' అని పలుమార్లు డైలాగులు కూడా వాడుతుందని తెలిసింది. మొత్తంగా ఆమె లేడీ వకీల్ సాబ్‌లా కనిపిస్తుందని అంటున్నారు. ఈ సీన్స్ అన్నీ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసేలా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో శ్రీయ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











