వకీల్ సాబ్ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్.. ఈసారి ఆ హీరో కోసం పవర్ఫుల్ కథ
టాలీవుడ్ లో ప్రస్తుతం వకీల్ సాబ్ దర్శకుడి పేరు కూడా బాగానే వైరల్ అవుతోంది. మొదటి రెండు సినిమాలతో పూర్తి స్థాయిలో క్రేజ్ అందుకోలేకపోయినప్పటికి మూడవ సారి మాత్రం వకీల్ సాబ్ తో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక అతనికి ఇతర బడా నిర్మాతల నుంచి అగ్ర హీరోల కోసం కథలు రెడీ చేయమని ఆఫర్లు చాలానే వస్తున్నాయి. కానీ వేణు శ్రీరామ్ మాత్రం దిల్ రాజు ప్రొడక్షన్ లోనే వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక నెక్స్ట్ మరో స్టార్ హీరో కోసం పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం.

ఆ సినిమా హిట్టవ్వకపోయినా కూడా..
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే వర్క్ చేసుకుంటూ వస్తున్న దర్శకుడు వేణు శ్రీరామ్ మొదట 'ఓ మై ఫ్రెండ్' సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినప్పటికి ఓ వర్గం అడియెన్స్ ను మాత్రం అమితంగా ఇష్టపడతారు.

దిల్ రాజు నమ్మకంతో..
మొదటి సినిమా కమర్షియల్ గా హిట్టవ్వకపోవడంతో వేణు శ్రీరామ్ చాలా కాలం అవకాశాలు లేకుండా ఉన్నాడు. ఇక బయటకు వెళ్లకుండా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే కథల చర్చలలో, అలాగే రైటర్ గా వర్క్ చేసుకుంటూ వచ్చాడు. ఇక దిల్ రాజు నమ్మకంతో మరో అవకాశం ఇవ్వడంతో MCA కమర్షియల్ గా హిట్ అందుకున్నాడు.

మూడవసారి కూడా వర్కౌట్ అయ్యింది
ఇక మూడవసారి అతనిపై దిల్ రాజు పెట్టుకున్న నమ్మకం కూడా వర్కౌట్ అయ్యింది. వకీల్ సాబ్ సినిమాను ఒక రీమేక్ సినిమాలాగా కాకుండా సొంతంగా తనదైన శైలిలో మార్చుకున్నాడు. అభిమానులకు నచ్చే అంశాలను కూడా జోడించి ట్రైలర్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేశాడు.
Recommended Video

పవన్ కళ్యాణ్ తో మరో సినిమా
ఇక మొత్తానికి వకీల్ సాబ్ తో బాక్సాఫీస్ హిట్ అందుకోవడంతో నాలుగవసారి కూడా దిల్ రాజు సలహా మేరకు పవన్ కళ్యాణ్ కోసం మరో పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లికి కూడా ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నప్పటికి వేణు చెప్పిన స్టోరీ లైన్ దిల్ రాజుకి బాగా నచ్చిందట. అందుకే మరో ఆలోచన లేకుండా పవన్ తదుపరి సినిమా బాధ్యతను వేణుకి అప్పగించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











