పవన్ మూవీని పక్కన పెట్టేసిన వకీల్ సాబ్ డైరెక్టర్.. మరో మెగా హీరోతో బడా ప్రాజెక్ట్.!

By Manoj

తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి వచ్చినప్పటికీ... ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా తన మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని చాలా మంది మేకర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా పవన్‌తో సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఇప్పుడు ఆ మూవీని పక్కన పెట్టేశాడని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు మీకోసం.!

Recommended Video

Vakeel Saab Director Venu Sriram About Trivikram Srinivas
 పవన్ ప్రతిష్టాత్మక చిత్రానికి డైరెక్టర్‌గా

పవన్ ప్రతిష్టాత్మక చిత్రానికి డైరెక్టర్‌గా

సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వకీల్ సాబ్ కోసం సరికొత్త ప్రయోగాలు

వకీల్ సాబ్ కోసం సరికొత్త ప్రయోగాలు

వాస్తవానికి ‘పింక్' మూవీని తమిళంలో అజిత్ హీరోగా ‘నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో తెరకెక్కించారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అందుకే పవన్ రీఎంట్రీకి దీన్ని ఎంచుకున్నాడు. చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవడంతో పవర్ స్టార్‌ను ఇందులో ఎలివేట్ చేసేలా దర్శకుడు వేణు శ్రీరామ్ స్క్రిప్టుకు మార్పులు చేశాడని సమాచారం.

 బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని

బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని

కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న తనకు పవన్ కల్యాణ్‌తో పని చేసే అవకాశం రావడంతో వేణు శ్రీరామ్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అంతేకాదు, తనకు దక్కిన అరుదైన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు తెగ కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే పవన్ లుక్.. బాడీ లాంగ్వేజ్ సహా సినిమా విషయంలో అన్నీ పక్కాగా ఉండేలా ప్లాన్ చేశాడని తెలుస్తోంది.

దర్శకుడితో పాటు యూనిట్‌కు షాక్

దర్శకుడితో పాటు యూనిట్‌కు షాక్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘వకీల్ సాబ్' మూవీ ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరగా పూర్తి చేసి మే నెలలోనే సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, కరోనా ప్రభావంతో షూటింగ్‌కు బ్రేక్ పడడంతో సినిమా వాయిదా పడిపోయింది. దీంతో ఫ్యాన్స్ కూడా నిరుత్సాహానికి లోనయ్యారు.

 పవన్ సినిమాను పక్కన పెట్టేశాడు

పవన్ సినిమాను పక్కన పెట్టేశాడు

లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు ఆలస్యం అయ్యాయి. చిత్రీకరణకు పర్మీషన్ వచ్చినా... కరోనా విజృంభిస్తుండడంతో టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిపివేశారు. అంతేకాదు పరిస్థితి చక్కబడే వరకూ వేచి చూడాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్' దర్శకుడు వేణు శ్రీరామ్... ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసినట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

 మరో మెగా హీరోతో భారీ ప్రాజెక్ట్..!

మరో మెగా హీరోతో భారీ ప్రాజెక్ట్..!

నిజానికి ‘వకీల్ సాబ్' దర్శకుడు వేణు శ్రీరామ్... ఈ మూవీ కంటే ముందే అల్లు అర్జున్‌తో ‘ఐకాన్.. కనబడుట లేదు' అనే ప్రాజెక్టు చేయాలి. అనివార్య కారణాల వల్ల అది ప్రకటనకే పరిమితం అయింది. ఇక, ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా దొరికిన సమయాన్ని ఈ యంగ్ డైరెక్టర్ ఆ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌కు కేటాయించాడట. బన్నీ సూచన మేరకు అందులో మార్పులు చేస్తున్నాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X