వకీల్ సాబ్‌పై దిల్ రాజు ఆలోచన.. ఇక బాక్సాఫీస్ బద్దలే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లింది. అంతా మామూలుగా ఉండి ఉంటే ఈపాటికే వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల అంతా తారుమారైంది. సినిమా షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో అన్ని వాయిదా పడ్డాయి.
త్వరత్వరగా షూటింగ్స్ కంప్లీట్ చేస్తూ.. సాధ్యమైనన్నీ సినిమాలను పట్టాలెక్కిద్దామని భావించిన పవన్ కళ్యాణ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇటు వకీల్ సాబ్ షూటింగ్ ఆగిపోయింది. అటు క్రిష్ సినిమాకు ఇచ్చిన డేట్స్ అన్నీ వృథా అయిపోయాయి. అయితే తాజాగా వకీల్ సాబ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది.

వకీల్ సాబ్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పవన్ కల్యాణ్ పోర్షన్‌కి సంబంధించి 20 రోజుల చిత్రీకరణ మిగిలివుందని తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరి నుంచి తప్పుకునేట్టుగానే ఉంది. అందుకే వకీల్ సాబ్‌ను.. సంక్రాంతి బరిలో దించితే ఎక్కువ కలెక్షన్లు రాబట్టుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి వకీల్ సాబ్‌కు ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











