పవన్‌తో పాటు వాళ్లందరి రెమ్యూనరేషన్ వివరాలు లీక్: ఒక్క సినిమాకు ఎవరు ఎంత తీసుకున్నారంటే!

దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దీంతో ఆయన అభిమానులు పది రోజుల ముందు నుంచే ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఫలితంగా ఈ సినిమా విడుదల పండుగను తలపించేలా జరిగింది. అందుకు అనుగుణంగానే ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' మూవీ కోసం పవన్ కల్యాణ్, శృతి హాసన్, అంజలి, నివేదా తదితరులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు లీకయ్యాయి. అది మీకోసం!

‘వకీల్ సాబ్’గా మారిపోయిన పవన్ కల్యాణ్

‘వకీల్ సాబ్’గా మారిపోయిన పవన్ కల్యాణ్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఆడవాళ్ల సమస్యలను ప్రస్తావిస్తూ తీసిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు.

భారీగా రెస్పాన్స్.. 90 శాతం రికవరీ చేసింది

భారీగా రెస్పాన్స్.. 90 శాతం రికవరీ చేసింది

భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీనికి అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన స్పందన వచ్చింది. తద్వారా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పాటు భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ దక్కాయి. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్లను కూడా అదే రీతిలో దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 90 శాతం రికవరీ సాధించింది.

‘వకీల్ సాబ్’కు వరుస దెబ్బలు.. కష్టమేనట

‘వకీల్ సాబ్’కు వరుస దెబ్బలు.. కష్టమేనట


'వకీల్ సాబ్' చిత్రానికి ఆరంభం నుంచే వరుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా బెనిఫిట్, స్పెషల్ షోలు రద్దు చేసింది. ఆ వెంటనే టికెట్ రేట్లను తగ్గించాలని కొత్త జీవోను తీసుకొచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడిపోయింది. ఇప్పుడేమో కరోనా నేపథ్యంతో సినిమాకు మరిన్ని కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి.

పవన్‌ భారీ రెమ్యూనరేషన్... వివరాలు ఇవే

పవన్‌ భారీ రెమ్యూనరేషన్... వివరాలు ఇవే


'వకీల్ సాబ్' చిత్రానికి గానూ పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. దీని కోసం అంత అందుకున్నాడు.. ఇంత చార్జ్ చేస్తున్నాడు అని ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ సమయంలో పవర్ స్టార్ తీసుకున్న అసలు రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. రూ. 50 కోట్లు తీసుకున్నాడట.

మరో రూ. 15 కోట్లు అలా తీసుకున్న పవన్

మరో రూ. 15 కోట్లు అలా తీసుకున్న పవన్

'వకీల్ సాబ్' సినిమా కోసం పవన్ కల్యాణ్ రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడు. అదే సమయంలో మరో రూ. 15 కోట్లను ఓ ఏరియా రైట్స్‌లో షేర్‌గా తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ కూడా దాటిపోవడంతో లాభం కూడా వచ్చిందని అంటున్నారు. దీంతో రీఎంట్రీతో పవన్ భారీగా లాభపడినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

హీరోయిన్లలో ఎవరు ఎంత తీసుకున్నారంటే

హీరోయిన్లలో ఎవరు ఎంత తీసుకున్నారంటే

'వకీల్ సాబ్' మూవీలో హీరోయిన్లు నలుగురు నటించిన విషయం తెలిసిందే. పది నిమిషాలు కనిపించిన శృతి హాసన్‌‌తో పాటు అంజలికి చేరో రూ. 50 లక్షలు చెల్లించాడట నిర్మాత దిల్ రాజు. ఇక, నివేదా థామస్‌కు మాత్రం రూ. 75 లక్షలు ఇచ్చాడట. అలాగే, అనన్యకు రూ. 25 లక్షలు అప్పజెప్పాడని అంటున్నారు. దీంతో నలుగురికి కలిపి రూ. 2 కోట్లు చార్జ్ చేశాడని తెలుస్తోంది.

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
వాళ్లకు కూడా అదే స్థాయిలో ఇచ్చిన నిర్మాత

వాళ్లకు కూడా అదే స్థాయిలో ఇచ్చిన నిర్మాత

హీరో, హీరోయిన్లకే కాదు.. 'వకీల్ సాబ్'లో పవన్‌కు పోటీగా నటించిన ప్రకాశ్ రాజ్‌కు రూ. కోటికి పైగానే చెల్లించారని తెలుస్తోంది. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్‌ థమన్ కూడా భారీగానే అందుకున్నాడని అంటున్నారు. వీళ్లతో పాటు కెమెరామెన్‌కు కూడా ఊహించిన దాని కంటే ఎక్కువే చెల్లించారట. డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కు ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువే అందించినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X