చివరి నిమిషంలో లెక్కలు మార్చిన వకీల్ సాబ్.. ఒక్కసారిగా పెరిగిన రేటు.. మంచి లాభమే!
వకీల్ సాబ్ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక టీజర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయగా సినిమా రికార్డు స్థాయిలో వ్యూవ్స్ ను అందుకుంటోంది. అత్యదిక లైక్స్ అందుకున్న తీజర్స్ లలో స్థానం సంపాదించుకున్న వకీల్ సాబ్.. బిజినెస్ లెక్కలని ఒక్కసారిగా మార్చేసినట్లు తెలుస్తోంది.

పర్ఫెక్ట్ బూస్ట్ ఇచ్చిన వకీల్ సాబ్
ఒక సినిమాకు బజ్ క్రియేట్ అవ్వాలి అంటే సినిమా ప్రమోషన్ కూడా చాలా అవసరమని మరోసారి ఋజువయ్యింది. టీజర్ కోసం ఎప్పటి నుంచో వేయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు వకీల్ సాబ్ పర్ఫెక్ట్ బూస్ట్ ఇచ్చింది. యూ ట్యూబ్ లో అయితే ఫాస్టెస్ట్ లైక్స్ అందుకోవడంలో కూడా టీజర్ ఒక రికార్డును అందుకుంది.

ఈజీగా వంద కోట్ల బిజినెస్
దాదాపు RRR సినిమాకు సంబంధించిన టీజర్స్ తో పోటీ పడిన వకీల్ సాబ్ ఇక బిజినెస్ లెక్కలను కూడా మార్చేసినట్లు తెలుస్తోంది. సినిమా తప్పకుండా వంద కోట్ల బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ పింక్ సినిమాకు ఈ సినిమా రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో మిగతా దారుల్లో కూడా మంచి లాభాలను అందిస్తున్నట్లు టాక్.

వకీల్ సాబ్ కోసం..పోటాపోటీగా..
శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా సినిమాకు రోజురోజుకు మంచి డిమాండ్ పెరుగుతున్నట్లు అర్ధమవుతోంది. మొదట 12కోట్ల వరకు సినిమా శాటిలైట్ హక్కుల కోసం పోటీ పడిన వారే ఇప్పుడు సడన్ గా రేటు పెంచినట్లు సమాచారం. జెమినీ టీవీ, జీ తెలుగు ఛానెల్స్ మొదటి నుంచి కూడా శాటిలైట్ హక్కుల కోసం గట్టిగానే పోరాడుతున్నాయి.

అప్పుడే 15కోట్ల లాభం..
ఇక ఫైనల్ గా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. టీజర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో చివరి నిమిషంలో రేటును రూ.15కోట్లకు పెంచినట్లు సమాచారం. త్వరలోనే దిల్ రాజు ఈ డీల్ ను క్లోజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే పవర్ స్టార్ ఈ సారి భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడని తెలుస్తోంది.

సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
ఇక సినిమా రిలీజ్ డేట్ పై గత కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేయనున్నారట. థియేటర్స్ మళ్ళీ యధావిధిగా నడిచినప్పుడే సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్న దిల్ రాజు పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 9న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











