ఆదిలోనే వకీల్ సాబ్ ఎఫెక్ట్.. పవర్ స్టార్ అభిమానులకు బిగ్ షాక్! ఆశలన్నీ అడియాశలే..

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన రీ ఎంట్రీ విషయం తెలియగానే మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అతి త్వరలో మళ్ళీ వెండితెరపై పవన్ హంగామా చుసేయొచ్చని ఫిక్సయ్యారు. ఈ మేరకు 'వకీల్ సాబ్' మీ ముందుకు రాబోతున్నానని చెప్పిన పవన్.. ఆదిలోనే అభిమానులను నిరాశ పరుస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

వచ్చేశాడు.. వకీల్ సాబ్

వచ్చేశాడు.. వకీల్ సాబ్

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్ మూవీ 'పింక్' సినిమాను తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాతోనే పవన్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా శరవేగంగా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్ విశేష ప్రేక్షాకాదరణ పొందింది.

ముగ్గురు హీరోయిన్స్.. ప్రకాష్ రాజ్ రోల్

ముగ్గురు హీరోయిన్స్.. ప్రకాష్ రాజ్ రోల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావ‌డంతో ఫ్యాన్స్ భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Recommended Video

Vakeel Saab First Single : Vakeel Saab First Song On 8th March || Filmibeat Telugu
అంతా ఓకే అనుకుంటుండగానే..

అంతా ఓకే అనుకుంటుండగానే..

ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ సవ్యంగా సాగుతుండటంతో వేగం పెంచి 70 శాతం షూటింగ్ ఫినిష్ చేశారు మేకర్స్. మార్చి నెలాఖరు లోగా షూటింగ్ ఫినిష్ చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పెషల్ కేర్ తీసుకొని అనంతరం మే 15న 'వకీల్ సాబ్' సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఊహించని విధంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొందట.

తప్పని పరిస్థితుల్లో పవన్..

తప్పని పరిస్థితుల్లో పవన్..

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా పవన్ కళ్యాణ్ బిజీ కానున్నారు. స్టానికంగా జరిగే ఎన్నికలు జనసేనకు కీలకం అని భావిస్తున్న ఆయన.. వకీల్ సాబ్‌ సినిమాకు కేటాయించిన డేట్స్‌ అడ్డస్ట్ చేసుకోక తప్పడం లేదట. ఈ కారణంగా సినిమా రెగ్యులర్ షూట్‌కి అంతరాయం ఏర్పడుతోంది.

పవర్ స్టార్ అభిమానులకు బిగ్ షాక్

పవర్ స్టార్ అభిమానులకు బిగ్ షాక్

ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ (మే 15) వకీల్ సాబ్ సినిమాను విడుదల చేయడం కష్టమే అనే సమాచారం బయటకొచ్చింది. కనీసం నెల రోజులైనా వాయిదా పడటం ఖాయం ని తెలుస్తోంది. త్వరలోనే 'వకీల్ సాబ్' కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలున్నాయట.

ఆశలపై నీళ్లు జల్లి.. బిగ్ షాక్

ఆశలపై నీళ్లు జల్లి.. బిగ్ షాక్

దీంతో.. పవన్ సిల్వర్ స్క్రీన్ హంగామా ఎప్పుడెప్పుడు చూడాలా అని కుతూహలంగా ఉన్న ప్రేక్షకుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఒకరకంగా ఇది బిగ్ షాకే మరి!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X