వకీల్ సాబ్: పవన్ సరసన హాట్ బ్యూటీ.. ఇదే జరిగితే!!
'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత వెండితెరకు దూరమై రాజకీయ బాట పట్టిన పవన్ కళ్యాణ్ తిరిగి 'వకీల్ సాబ్' రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పవన్ మళ్ళీ కెమెరా ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా అప్‌డేట్స్‌పై జనాల్లో ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది.
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా 'పింక్' చిత్రానికి రీమేక్‌గా ఈ 'వకీల్ సాబ్' రూపొందుతోంది. చిత్రంలో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలాఉంటే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రంలో పవన్‌కి భార్యగా శృతి హాసన్ కనిపించనుందని టాక్ వస్తోంది. ఇప్పటికే శృతి హాసన్‌తో సంప్రదింపులు కూడా జరిగాయని, ఆమె ఓకే చెప్పినప్పటికీ.. డేట్స్ విషయంలో సమస్య తలెత్తుతోందని తెలుస్తోంది. పవన్ లాగే చాలా గ్యాప్ తీసుకున్న శృతి ప్రస్తుతం రవితేజ 'క్రాక్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో వకీలు సాబ్ కోసం ఆమె డేట్స్ విషయమై కాస్త గందరగోళం నెలకొందని సమాచారం.
ఏది ఏమైనప్పటికీ పవన్ సరసన శృతి నటించడం మాత్రం కన్ఫర్మ్ అని టాక్. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్‌తో శృతి జోడీ కట్టడం ఇది ముచ్చటగా మూడోసారి అవుతుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











