కరోనా ఎఫెక్ట్: దేశమంతా లాక్‌డౌన్.. 'వకీల్ సాబ్' వర్క్ ఫ్రమ్ హోమ్
ప్రపంచమంతా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ విలయతాండవానికి అశేష మానవాళి జంకిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు లాక్‌డౌన్ అమలు చేశాయి. దీంతో పలు సినిమాల షూటింగ్స్ రద్దయ్యాయి. అయితే హీరో పవన్ కళ్యాణ్ మాత్రం 'వకీల్ సాబ్' కోసమై ఈ లాక్‌డౌన్ సమయంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారనేది తాజా సమాచారం వివరాల్లోకి పోతే..
Recommended Video

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. 'వకీల్ సాబ్' కసరత్తులు
కరోనా వైరస్ విజృంభణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. కరోనా దెబ్బకు సినీ, పారిశ్రామిక రంగాలు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' కరోనా కారణంగా వాయిదా పడనుందని విన్నాం. కానీ అనుకున్న సమయానికే విడుదలయ్యేలా పవన్ కసరత్తులు చేస్తున్నట్లు టాక్.

మే 15 టార్గెట్.. ఊహించని విధంగా
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన వకీల్ సాబ్.. ఇప్పటికే 80 శాతం మేర చిత్రీకరణ పూర్తి చేశారు. మిగితా షూటింగ్ కూడా కంప్లీట్ చేసి మే 15న ఈ సినిమా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. కానీ ఊహించని విధంగా కరోనా ప్రబలడంతో వకీల్ సాబ్ షూటింగ్ వాయిదా పడింది.

ఇంటి నుంచే పవన్ కళ్యాణ్
దీంతో మే 15న 'వకీల్ సాబ్' విడుదల కావడం కష్టమే అనే వార్తలు వచ్చాయి. కానీ అనుకున్న టార్గెట్ తేదీనే ఎలాగైనా ఫినిష్ చేయాలని పట్టుదలగా ఉందట చిత్రయూనిట్. ఈ మేరకు ఇప్పటిదాకా అయిన షూటింగ్ తాలూకు డబ్బింగ్ కార్యక్రమాలు ఇంటి నుంచే ఫినిష్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్. ఇలా చేస్తేనే లాక్‌డౌన్ ఎత్తివేయగానే మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసి అనుకున్న తేదీకి విడుదల చేయొచ్చని యూనిట్ ప్లాన్ చేసిందట.

'వకీల్ సాబ్' మూవీ.. దిల్ రాజు
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' సినిమాకు రీమేక్‌గా 'వకీల్ సాబ్' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ముగ్గురు భామలు.. ఆమెనే కీలకం
'వకీల్ సాబ్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో నివేదా థామస్ రోల్ సినిమాకు హైలైట్ కానుందని తెలుస్తోంది. గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఆమె పాత్ర ఉండనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











