వక్కంతం వంశీ కథతో మహేష్ బాబు చిత్రం

By Srikanya

హైదరాబాద్: రేసు గుర్రం ఘన విజయంతో వక్కంతం వంశీకి టాలీవుడ్ లో తిరుగే లేకుండా పోయింది. తాజాగా టెంపర్ చిత్రానికి కథ అందిస్తున్న ఆయన మరో చిత్రానికి కథ ఇవ్వటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు మహేష్ బాబు. మరి దర్శకుడు ఎవరంటారా...ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి ఆ దర్శకుడు మరెవరో కాదు పూరి జగన్నాధ్. టెంపర్ కథతోనూ, వర్కింగ్ స్టైల్ తోనూ ఇంప్రెస్ అయిన పూరి జగన్నాథ్ తను మహేష్ తో తదుపరి చేయబోయే చిత్రానికి కథ ఇవ్వమన్నట్లు సమాచారం. ఈ మేరకు రెండు మూడు లైన్స్ వక్కంతం వినిపించారని, వాటిల్లో ఒకటి ఓకే చేసి ఫుల్ స్క్రిప్టు ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న శ్రీమంతుడు చిత్రం పూర్తయ్యాక, అలాగే పూరి జగన్నాథ్ తాజాగా ఒప్పుకున్న జ్యోతి లక్ష్మీ చిత్రం ఫినిష్ అయ్యాక ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది. మహేష్ బాబుకు వక్కంతం వంశీ కథ ఇవ్వటం రెండో సారి. ఇంతకు ముందు ఆయన అతిథి చిత్రానికి కథ అందించారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. అయితే ఈ సారి పక్కా కమర్షియల్ స్క్రిప్టుతో రానున్నాడని చెప్తున్నారు.

 Vakkantham Vamsi's story for Mahesh Babu ?

పూరి తాజా చిత్రం టెంపర్ విషయానికి వస్తే...

ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు. అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ లోగా సీడెడ్ లో చాలా చోట్ల 12 రాత్రి తెల్లారితే 13 అనగా షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది.

 Vakkantham Vamsi's story for Mahesh Babu ?

జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పిభ్రవరి 13న విడుదల అవుతున్న ఈ చిత్రం కు స్టన్నింగ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి దాదాపు అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేసేసారు.

ఆడియో పంక్షన్ లో ఈ చిత్రం అవుట్ పుట్ టెర్రిఫిక్ గా వచ్చిందని...తను తన సోదరుడు కలిసి ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నామని బంగ్ల గణేష్ ప్రకటించారు. దానికి తోడు దర్సకుడు పూరి జగన్నాథ్ సైతం కొన్ని ఏరియాలు రైట్స్ తీసుకుంటున్నట్లు వార్త వచ్చింది. ఈ నేపధ్యంలో ప్రి రిలీజ్ బిజినెస్ 42 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X