రాజమౌళి తరువాత రాంచరణ్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది.. క్రేజీగా ప్లానింగ్!

Recommended Video

Ram Charan Next To Act In Vamsi Paidipally'S Movie

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత రాంచరణ్ ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రాంచరణ్ లతో ఈ చిత్రం సౌత్ లోనే అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కబోతోంది. ఇదిలా ఉండగా రాంచరణ్ తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

క్రేజీగా ప్లానింగ్

క్రేజీగా ప్లానింగ్

రాంచరణ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం పక్కాగా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. రంగస్థలం చిత్రంలో రాంచరణ్ తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. దీనితో రాంచరణ్ తదుపరి చిత్రాలపై ఆడియన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది.

స్టార్ డైరెక్టర్

స్టార్ డైరెక్టర్

బోయపాటి కాంబోలో రాబోతున్న చిత్రానికి ఇంకా టైటిల్ కూడా ప్రకటించలేదు. రాజమౌళి చిత్రం ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అయినా కూడా చరణ్ తన నెక్స్ట్ మూవీస్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. రాజమౌళి చిత్రం తరువాత రాంచరణ్ నటించబోయేది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అని వార్తలు వస్తున్నాయి.

ఎవడు కాంబినేషన్

ఎవడు కాంబినేషన్

రాంచరణ్, వంశీ కాంబినేషన్ లో ఇదివరకే ఎవడు చిత్రం వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచినా సంగతి తెలిసిందే. కమర్షియల్ చిత్రాలనే స్టైలిష్ గా తెరకెక్కించడంలో వంశీ సిద్ధహస్తుడు. విభిన్నమైన చిత్రాలతో సైతం ఆడియన్స్ ని మెప్పించగలడు. ఇలాంటి దర్శకుడి కాంబోలో రాంచరణ్ సినిమా వస్తే క్రేజీగా మారడం ఖాయం.

 మహర్షి తరువాత

మహర్షి తరువాత

ప్రస్తుతం వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవ్వడానికి ఏడాది సమయం పట్టొచ్చు. ఈలోపు రాంచరణ్ బోయపాటి సినిమాని ఫినిష్ చేసి రాజమౌళి సినిమా కూడా ఓ కొలిక్కి వస్తుంది. అన్ని కుదిరితే చరణ్, వంశీ కాంబినేషన్లో చిత్రం 2019 ద్వితీయార్థంలో పారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందువలనే

అందువలనే

వంశీ విభిన్నమైన దర్శకత్వ శైలి వలన రాంచరణ్ ఆకర్షితుడయ్యాడు. అందువలనే అతడి దర్శకత్వంలో నటించేందుకు చరణ్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి మద్య తదుపరి చిత్రం గురించి ప్రాధమిక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X