»   » అఖిల్ కి వంశీ పైడిపల్లి హ్యాండ్ వెనక మహేష్ బాబు ఉన్నాడా..!!?

అఖిల్ కి వంశీ పైడిపల్లి హ్యాండ్ వెనక మహేష్ బాబు ఉన్నాడా..!!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఊపిరి దర్శకుడు వంశీ పైడిపల్లి నే అఖిల్ రెండో సినిమాకి దర్శకుడూ అంటూ వచ్చిన వార్తలు నిజమో కాదో తెలియకముందే ఆ ప్రాజెక్ట్ నుండి దర్శకుడు వంశీ పైడి పల్లి తప్పుకున్నాడు అంటూ మీడియాలో వార్తలు తెగ వచ్చాయి. అఖిల్ వ్యవహారం నచ్చకనే వంశీ తప్పుకున్నాడు అని కూడా కొన్ని పత్రికల్లో వార్తలు రావటం తో అక్కినేని వారసుడు అఖిల్ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తాను వంశీ పైడిపల్లితో సినిమాను చేయడం పక్కా అంటూ మీడియాకు క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. దీంతో ఇక సినిమా పక్కా అని అనుకున్నారంతా...

అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ మాత్రం మళ్ళీ కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఇప్పుడు ఈ వార్తల్లో సూపర్ స్టార్ మహేష్ పేరు వినిపించటం."బ్రహ్మోత్సవం" లాస్ లు సద్దుబాటు చేయడానికి మహేష్ పివిపి సంస్థకు వచ్చే సంవత్సరం చేయబోయే మరో సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను స్వయంగా మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లికి అప్పచెప్పినట్లు ఫిలింనగర్ టాక్.

Vamshi Paidipally Ditches Akhil For Mahesh Babu

మహేష్ వెకేషన్ కోసం లండన్ వెళ్లబోయే ముందు వంశీ పైడి పల్లికి స్వయంగా కాల్ చేసి మరీ నాకోసం ఒక మంచి స్క్రిప్ట్ ను తయారు చేయమని మహేష్ స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు టాక్. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఫిలిం నగర్ లో మాత్రం ఇదే నిజం అన్నంతగా స్పష్టంగానే మాట్లాడుకుంతున్నారు.

దీనితో అఖిల్ వంశీ పైడిపల్లిల కాంబినేషన్లో సినిమా ఇక అటక ఎక్కినట్లే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అఖిల్ రెండవ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడు అని నాగార్జున ఓపెన్ గా ప్రకటించాక కూడ వంశీ పైడిపల్లి ఇప్పుడు ఇలా మరో ట్విస్ట్ ఇచ్చి మహేష్ వైపు వెళ్ళి పోవడం తీరని అవమానంగా అక్కినేని కాంపౌండ్ భావిస్తున్నట్లు టాక్.ఇది నాగార్జున ని పూర్థిగా పక్కన పెట్టినట్టే కనిపించటం తో మరింత ప్రాధన్యత సంతరించుకుందీ వార్త.

Vamshi Paidipally Ditches Akhil For Mahesh Babu

అఖిల్ కోసం ఒక కథను వంశీ పైడిపల్లి తయారు చేసినా ఆ సినిమాను నిర్మించే మైత్రి మూవీస్ ఆ కథకు అయ్యే భారీ బడ్జెట్ కు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అఖిల్ తో వంశీ మొదలు పెట్టవలసిన మూవీ ప్రాజెక్ట్ ఆగి పోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే అఖిల్ కోసం మరో కధను ఆలోచిస్తాను అని వంశీ పైడిపల్లి విదేశాలకు వెళ్ళిపోయి ఆక్కడ అఖిల్ సినిమా గురించి ఆలోచించకుండా అసలు ఆ ప్రాజెక్ట్ నే పక్కన పెట్టి., ఇప్పుడు మహేష్ వైపు వంశీ టర్న్ తీసుకోవడం నాగార్జున కు షాకింగ్ న్యూస్ గా మారిందట. అసలు సంగతి ఏమిటీ ఇప్పుడు తన కొడుకు కోసం నాగార్జున ఎలాంటి స్టెప్ తీసుకుంటాడూ అనేది ఆసక్తిగా మారింది..

English summary
Suddenly new reports have emerged that Vamsi Paidipally will be directing Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu