మళ్ళీ మహేష్ కోసం వెయిట్ చేస్తే.. ఆ దర్శకుడు రిస్క్ లో పడ్డట్లే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ లో చాలా కథలపై చర్చలు జరిపాడు. ఫైనల్ గా దర్శకధీరుడు రాజమౌళితో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. గతంలో ఎప్పుడు లేని విదంగా మహేష్ సరికొత్త లుక్ తో కనిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే నెక్స్ట్ ఈ స్టార్ హీరో కోసం ఒక దర్శకుడు చాలా రోజుల నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూ గెటప్..

న్యూ గెటప్..

నెక్స్ట్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సర్కారు వారు పాట అనే టైటిల్ కూడా సిద్ధం చేసినట్లు టాక్ వస్తోంది. అయితే ఆ సినిమా కోసం మహేష్ బాబు మరీంత యంగ్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలలో అప్పుడే 20లోకి అడుగుపెట్టిన కుర్రాడిలా మహేష్ కనిపిస్తున్నాడు.

 వంశీ పైడిపల్లితో..

వంశీ పైడిపల్లితో..

దర్శకుడు వంశీ పైడిపల్లితో మహర్షి సినిమాను చేసిన మహేష్ ఆ తరువాత కూడా మరొక సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. మహర్షి షూటింగ్ టైమ్ లోనే ఒక చిన్న స్టోరీ లైన్ చెప్పి మెప్పించిన మహేష్ ఫుల్ స్టోరీ సెట్టయితే సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ ఆ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడు. ఈ లోపు అనిల్ రావిపూడి, రాజమౌళి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వంశీ ఛాన్స్ మిస్సయ్యింది.

మరో కొత్త స్టోరీ..

మరో కొత్త స్టోరీ..

నిజానికి మహర్షి సినిమా సక్సెస్ పై మహేష్ అంతగా సంతృప్తి చెందలేదట. కమర్షియల్ గా సినిమా అనుకున్నంతగా వసూళ్లను రాబట్టలేదు. అయినప్పటికీ వంశీ పైడిపల్లితో మరోసారి వర్క్ చేయాలని మహేష్ అనుకున్నప్పటికి సెట్టవ్వలేదు. దీంతో వంశీ మరొక కొత్త కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బిజీగా ఉన్నప్పటికీ తన స్టోరీతో మెప్పించాలని సిద్ధం అయ్యాడట.

Recommended Video

Karthika Deepam fame Nirupam AKA Karthik Got gift from Chiranjeevi's Mother Anjana Devi
నెక్స్ట్ రాజమౌళితోనే..

నెక్స్ట్ రాజమౌళితోనే..

మహేష్ బాబు చాలా వరకు సక్సెస్ లో ఉన్న దర్శకులతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు వచ్చాడు అంటే ఆగుతాడా..? పరశురామ్ తో సినిమా అయిపోగానే నెక్స్ట్ రాజమౌళితోనే సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక వంశీ పైడిపల్లి మహర్షి కోసం వెయిట్ చేసినట్లుగా ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కోసం వెయిట్ చేయకపోతేనే మంచిది. వేరే సినిమా చేసి మహేష్ బాబుతో తరువాత చేస్తే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X