మహేశ్ బాబు లిస్ట్ నుంచి ఆ డైరెక్టర్ ఔట్: అందుకే అలా ప్లాన్ చేస్తున్నాడా!

చందమామ లాంటి రూపంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. 'రాజకుమారుడు' అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు దాదాపు పాతికేళ్లుగా ఇండస్ట్రీలో హవాను చూపిస్తున్నాడు. ఇక, ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఈ స్టార్ హీరో.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ పక్కాగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగానే కొంత మంది దర్శకులను లైన్‌లో పెట్టుకున్నాడు. అయితే, తాజాగా ఆ జాబితా నుంచి ఒకరిని తీసేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం మహేశ్ బాబు.. పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి దీని కంటే ముందు అతడు తనకు 'మహర్షి' వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో సినిమాకు కమిట్ అయ్యాడు. కొద్ది రోజుల్లో ఈ మూవీ పట్టాలెక్కుతుందన్న సమయంలో, అనివార్య కారణాలతో అది కాస్తా ఆగిపోయింది. స్క్రిప్ట్ విషయంలో మహేశ్ బాబు చెప్పిన మార్పులను వంశీ పూర్తి చేయలేకపోయాడన్న కారణంతోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్న టాక్ వినిపించింది.

Vamshi Paidipally Out From Mahesh Babu List

అప్పుడు సినిమా ఆగిపోయినా.. ఫ్యూచర్‌లో మరోసారి వంశీతో మహేశ్ కలిసి చేస్తాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే 'సర్కారు వారి పాట' తర్వాత ఈ సినిమా ఉంటుందని భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలే లేవట. ప్రస్తుతం చేస్తున్న సినిమా అవగానే మహేశ్ బాబు.. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. దాని తర్వాత రాజమౌళితో సినిమా ఉంటుంది. ఇవన్నీ అవ్వాలంటే దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుంది. దీంతో వంశీ వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X