క్రేజీ డైరెక్టర్‌తో రాంచరణ్ రెండోసారి.. RRR తర్వాత ఈ చిత్రమే!

Recommended Video

Interesting Update About Ram Charan Next Movie || Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో భాగంగా గాయం కావడంతో రాంచరణ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది. ఇదిలా ఉండగా రాంచరణ్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ తాను గతంలో పనిచేసిన దర్శకుడికే మరోసారి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్‌లో అల్లూరిగా

ఆర్ఆర్ఆర్‌లో అల్లూరిగా

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెకెక్కుతుండడంతో ఏడాది పాటు షూటింగ్ కొనసాగనుంది. 2020 జులై 30న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఆ తర్వాతే రాంచరణ్ కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ ఏ దర్శకుడితో కలసి పనిచేస్తాడనే విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

 రెండవసారి

రెండవసారి

ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ఇటీవల రాంచరణ్ ని కలసి ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో చరణ్ వెంటనే సినిమా చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఎవడు చిత్రం వచ్చింది. ఎవడు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహర్షి మే 9న విడుదలకు సిద్ధం అవుతోంది.

ఏడాది చివర్లో

ఏడాది చివర్లో

రాంచరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వంశీ పైడిపల్లి ఈ ఏడాది చివరికల్లా పూర్తి కథని సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగితే డివివి దానయ్య వరుసగా మూడవ సారి రాంచరణ్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అవుతుంది. ఈ ఏడాది వచ్చిన వినయ విధేయ రామ చిత్రానికి దానయ్య నిర్మాత. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నది కూడా ఆయనే.

క్రేజీ దర్శకులతో సంప్రదింపులు

క్రేజీ దర్శకులతో సంప్రదింపులు

ఇదిలా ఉండగా క్రేజీ రాంచరణ్ కోసం కొందరు ప్రముఖ దర్శకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ, సురేందర్ రెడ్డి, క్రిష్ లాంటి దర్శకులు రాంచరణ్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాంచరణ్ తో సినిమా చేస్తానని కొరటాల శివ గతంలోనే చెప్పారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ ధృవ చిత్రంలోనటించాడు. ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు పొందిన క్రిష్ చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X