వంశీ కొత్త సినిమా టైటిల్ ఏమిటంటే...
గోపి..గోపిక..గోదావరి చిత్రంతో మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకున్న వంశీ త్వరలో తీయబోయే చిత్రానికి ఆయ్..మాది రాజమండ్రి అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రం కథా చర్చలు ప్రస్తుతం తీవ్ర స్ధాయిలో జరుగుతున్నాయి. పూర్తి తూర్పు గోదావరి శ్లాంగ్ తో ఈ చిత్రం డైలాగులు రాయిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరో ఎవరన్నదీ తేలలదు. అల్లరి నరేష్ తో ఆయన రూపొందించనున్న లేడీస్ టైలర్ సీక్వెల్ బదులుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మహర్షి బ్యానర్ పై వల్లూరి పల్లి రమేష్ ఈ చిత్రాన్ని తీయనున్నారు. గోపీ..గోపిక..గోదావరి టైటిల్ తో జనాల్ని ఆకట్టుకుని హిట్ చేసుకున్న ఉత్సాహంతో ఈ చిత్రంపై దృష్టి పెట్టారని చెప్తున్నారు. అలాగే పశలపూడి కధలు(వంశీ రాసినవి) కొన్ని తీసుకుని ఇందులో సీన్స్ క్రింద మారుస్తున్నారని సమాచారం.
More from Filmibeat
వంశీ లేడీస్ టైలర్ రాజేంద్రప్రసాద్ అన్వేషణ గోపి గోపిక గోదావరి కమిలినీ ముఖర్జీ వేణు vamsi ladies tailor rajendra prasad gopi gopika godavari kamilini mukarjee venu


Click it and Unblock the Notifications











