twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నలభై నిమిషాల పాటు ఆ సీక్వెన్స్.. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి మూవీ అప్‌డేట్

    |

    భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టిన సూపర్ స్టార్.. మరో సారి బాక్సాఫీస్‌ను షేక్ చేసి తన స్టామినాను నిరూపించుకున్నాడు. మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఇంకా ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉంది. సంక్రాంతి సీజన్ ముగిసినా కలెక్షన్ల వర్షం మాత్రం ఆగడం లేదు. ఇలాంటి సమయంలో మహేష్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది.

    కలెక్షన్ల జోరు..

    కలెక్షన్ల జోరు..

    ఈ చిత్రం ఇప్పటికే రెండు వందల కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి 250కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 120కోట్ల షేర్‌ను రాబట్టి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేస్తోంది. పూర్తి రన్ ముగిసే వరకు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

    గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో..

    గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో..

    మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించే సినిమాలో మహేష్ బాబు.. గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తాడన్న సంగతి ఇప్పటికే తెలిసిపోయింది. ఇప్పుడు మరి కొన్ని అప్ డేట్స్ బయటకు వచ్చాయి. సినిమాలో గ్యాంగ్ స్టర్ ఎపిసోడ్‌లు మొత్తం మీద 40 నిమషాలే వుంటాయని తెలుస్తోంది.

    రెండో షేడ్‌పై కసరత్తు..

    రెండో షేడ్‌పై కసరత్తు..

    ఈ సినిమాలో రెండు షేడ్స్‌లో మహేష్ కనిపించనున్నాడని టాక్. రెండో షేడ్ లో లెక్చరర్ గానో లేదా ప్రొఫసర్ మాదిరగానో కనిపిస్తాడని తెలుస్తోంది. మామూలుగానే మహేష్ సినిమాలకు వంద కోట్ల బడ్జెట్ అవుతుంది. ఈ సినిమాకు అంతకు మించి అవుతుందని తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ ఎపిసోడ్ లు టాప్ లెవెల్ లో వుంటాయని, వాటికే ఖర్చు ఎక్కువ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    విదేశాల్లో ఎంజాయ్..

    విదేశాల్లో ఎంజాయ్..

    సరిలేరు నీకెవ్వరు చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. విరామం లేకుండా షూటింగ్ చేసిన మహేష్.. ఈ మధ్య వెకేషన్‌కు వెళ్లాడు. ఫ్యామిలీతో కలిసి గత వారం రోజులుగా న్యూయార్క్, దుబాయ్ వంటి నగరాల్లో మకాం వేశాడు.

    English summary
    Buzz Is That Vamsi PadipallyAnd Mahesh Babu Project Have 40 Minutes Of Gang Ster Episodes. Now Mahesh Babu Enjoying Holiday With Family In New York.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X