మహేష్-వంశీ ప్రాజెక్ట్ .. ఫీలవుతున్న డైరెక్టర్.. నిర్మాత మాటతోనే మొత్తం చెడింది!!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకటే టాపిక్. అదే మహేష్ బాబు-వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్. విడదీయలేనంతగా కలిసి పోయిన రెండు కుటుంబాలకు ఇది పెద్ద షాకే. మహేష్ బాబు ఫ్యామిలీ, వంశీ పైడిపల్లి కుటుంబం ఎంతో బాగా కలిసిపోయాయి. సితార-ఆద్యల స్నేహం అయితే మరీ ఎక్కువైంది. ఇద్దరూ కలిసి యూ ట్యూబ్ చానెల్ కూడా నిర్వహిస్తున్నారు. అంతలా ఒక్కటైనప్పుడు ఇలాంటి సమస్య వస్తే నిజంగా షాక్ కొట్టినట్టు అవుతుంది. అసలు ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ అవ్వడానికి, వార్తలు బయటకు రావడానికి, ఈ వ్యవహరం చెడిపోవడానికి గల కారణాలేంటో ఓ సారి చూద్దాం.

మహర్షి సినిమాతో..

మహర్షి సినిమాతో..

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన మహర్షి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. వీకెండ్ ఫార్మింగ్ అనే కొత్త కాన్సెప్ట్ జనాల్లోకి బాగానే ఎక్కింది. చిత్రయూనిట్ కూడా అప్పట్లో బాగానే హల్చల్ చేసింది. మహర్షి సక్సెస్ అయిందని వంశీకి మరో చాన్స్ ఇచ్చాడు.

 గ్యాంగ్‌స్టర్, లెక్చరర్..

గ్యాంగ్‌స్టర్, లెక్చరర్..

మహేష్ బాబు కోసం ఈ సారి ఓ కమర్షియల్ చిత్రాన్ని అది కూడా గ్యాంగ్ స్టర్ కథల నేపథ్యంలో తీయబోతోన్నాడని వార్తలు వచ్చాయి. మరో పాత్రలో లెక్చరర్‌గానూ కనిపిస్తాడని రూమర్స్ వినిపించాయి. తీరా చూస్తే ప్రాజెక్టే క్యాన్సల్ అయింది. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ అయింది.

ఫీలవుతున్న దర్శకుడు..

ఫీలవుతున్న దర్శకుడు..

మహేష్‌ తన ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేసినందుకు తనకు బాధ లేదట కానీ ఇలా లీకులు ఇచ్చి తన ఇమేజ్ డ్యామేజ్ చేయడం నచ్చలేదట. కథ రెడీ చేయలేదని, స్క్రిప్ట్ వర్క్ సరిగా చేయలేకపోయాడని, మహేష్‌ను మెప్పించలేకపోయాడని వార్తలు రావడం పట్ల వంశీ తెగ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Actor Sunil & Rana Daggubati Must Learn From Mahesh Babu - Imandi Ramarao | Filmibeat Telugu
ఆ నిర్మాత మాటతోనే..

ఆ నిర్మాత మాటతోనే..

మహేష్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయినా.. కలెక్షన్లు బాగానే ఉంటున్నా నిర్మాతలకు మాత్రం పైసా మిగలడం లేదట. పైగా కొంత మేర నష్టాలను కూడా భరించుకోవాల్సి వస్తుందట. సరిలేరు విషయంలో మాత్రం నిర్మాత గట్టెక్కాడట కానీ లాభాలైతే పెద్దగా రాలేదట. ఈ విషయాలన్నీ గమనించిన దిల్ రాజు.. మహేష్‌ను రెమ్యూనరేషన్ తగ్గించమని అడిగాడట.. దీంతో ప్రాజెక్టే లేకుండా పోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X