డైరక్టర్ వంశీ పైడిపల్లి నెక్ట్స్ ఏంటి

By Srikanya

Vamsi paidipally’s multistarrer film
హైదరాబాద్ : ఎవడు చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో ఆ చిత్ర దర్శకుడు నెక్ట్స్ ఏంటనే విషయం అంతటా చర్చగా మారింది. అయితే ఈ సారి ఆయన ఎన్టీఆర్ తో చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ సైతం అతని దర్శకత్వంలో చిత్రం ప్రారంభించటానికిఆసక్తి చూపుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని వినికిడి. త్వరలోనే స్టోరీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత లైన్ చెప్పి డవలప్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఆ చిత్రంలో నాగార్జున ఓ కీలకమైన పాత్ర చేసే అవకాసం ఉందని చెప్తున్నారు. గతంలో ఎన్టీఆర్,వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో బృందావనం చిత్రం వచ్చి విజయవంతం అయ్యింది.

ఇక సంక్రాంతికి సందడి చేసిన చిత్రం 'ఎవడు'. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ కలిసి నటించడంతో అభిమానులు ఆ చిత్రం గురించి ఆసక్తిగా ఎదురు చూశారు. ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చినా ఆదరణ పొందింది. కథానాయకులు కలిసి నటిస్తే తప్పకుండా ఫలితాలుంటాయని మరోసారి చాటి చెప్పిన చిత్రమిది. అల్లు అర్జున్‌ తెరపై కనిపించింది కాసేపే అయినా... ఇద్దరు మెగా కథానాయకులు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. అభిమానులు కూడా ఆనందించారు. 'ఎవడు' ప్రేక్షకుల ముందుకొచ్చి ఆదివారంతో యాభై రోజులయ్యాయి.

ఈ సందర్భంగా చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ''కథలో కొత్తదనంతో పాటు చరణ్‌, అల్లు అర్జున్‌ నటన చిత్రానికి బలాన్నిచ్చింద''ని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. ''మా సంస్థలో మరుపురాని చిత్రంగా నిలిచింది. ఇంటిల్లిపాదినీ అలరించేలా మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించామన్న తృప్తి కలిగింద''ని నిర్మాత దిల్‌రాజు చెప్పారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ కథానాయికలుగా నటించారు. కాజల్‌ కీలక పాత్రలో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X