మరో డైరెక్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి చర్చలు: ఆయన ఫోన్ కాల్ కోసం వెయిటింగ్.. వర్కౌట్ అయ్యేనా!

రీఎంట్రీలో ఫుల్‌ స్పీడుతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 'ఖైదీ నెంబర్ 150'తో టాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్ అయిన ఆయన.. ఈ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాను చేశారు. అయితే, ఇది మాత్రం నిరాశనే మిగిల్చింది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకపోగా.. మరింత ఉత్సాహంతో వరుసగా నాలుగు ప్రాజెక్టులను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ మరో దర్శకుడితో తాజాగా సంప్రదింపులు జరిపారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

Recommended Video

Acharya : స్లో పాయిజన్ లా ఎక్కుతున్న Laahe Laahe Song
మెగా మల్టీస్టారర్.. ఆచార్యగా చిరంజీవి

మెగా మల్టీస్టారర్.. ఆచార్యగా చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అలాగే, రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

లూసీఫర్ రీమేక్‌.. ఆ దర్శకుడు రీఎంట్రీ

లూసీఫర్ రీమేక్‌.. ఆ దర్శకుడు రీఎంట్రీ

'ఆచార్య' షూట్ జరుగుతుండగానే 'లూసీఫర్' రీమేక్‌ను ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీని కోసం ఆయన చాలా మార్పులు చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుంది.

ఫ్లాపుల డైరెక్టర్‌తో చిరు మూవీ ప్రకటన

ఫ్లాపుల డైరెక్టర్‌తో చిరు మూవీ ప్రకటన

టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసినా హిట్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు మెహర్ రమేశ్. అతడికి మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చారు. దీంతో తమిళంలో బంపర్ హిట్ అయిన 'వేదాళం'ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ గుండు లుక్‌తో కనిపించబోతున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికి కారణం అలాంటి ఫొటోను చిరు పోస్ట్ చేయడమే.

టాలెంటెడ్ దర్శకుడితో స్ట్రెయిట్ సినిమా

టాలెంటెడ్ దర్శకుడితో స్ట్రెయిట్ సినిమా

తన కొత్త చిత్రాల జాబితాను.. వాటిని తెరకెక్కించే దర్శకుల వివరాలను గతంలోనే వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు చెప్పినట్లే కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని 'ఉప్పెన' ఈవెంట్‌లో స్వయంగా వెల్లడించారాయన. ఇక, ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. కొత్త కథతోనే ఇది రూపొందబోతుంది.

మరో స్టార్ దర్శకుడితో చిరంజీవి చర్చలు

మరో స్టార్ దర్శకుడితో చిరంజీవి చర్చలు

ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే రెండేళ్లలోనే ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా చిరంజీవి.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లితో కథా పరమైన చర్చలు జరిపినట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఫోన్ కాల్ కోసం వెయిటింగ్.. కుదిరేనా?

ఫోన్ కాల్ కోసం వెయిటింగ్.. కుదిరేనా?

'మహర్షి' వంటి భారీ హిట్‌ను అందుకున్నా.. తన తదుపరి సినిమాను ఇప్పటి వరకూ ప్రకటించలేదు వంశీ పైడిపల్లి. ఇలాంటి సమయంలో చిరంజీవికి ఓ యాక్షన్ స్టోరీని చెప్పాడని తెలుస్తోంది. అయితే, దీనిపై ఆయన మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదట. అంతేకాదు, వెయిట్ చేయమని చెప్పారని టాక్. దీంతో చిరు ఫోన్ కాల్ కోసం వంశీ వేచి చూస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X