నందమూరి హీరో తో మిస్ ఇండియా వరల్డ్

By Srikanya

హైదరాబాద్: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా మల్లికార్జున్ దర్శకత్వంలో విజయలక్ష్మి పిక్చర్స్ సంస్థ నిర్మించే 'షేర్' చిత్రం షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. సాయి నిహారిక సమర్పణలో కొమర వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మిస్ ఇండియా వరల్డ్ 2012, వన్య మిశ్రాని ఎంపిక చేసారు. చాలా మందిని ఆడిషన్ చేసిన తర్వాత ఈ చంఢీగర్ అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ 'ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్. కల్యాణ్‌రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా షేర్ కేరెక్టరైజేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ బాగా వచ్చింది. కల్యాణ్‌రామ్‌తో సూపర్‌హిట్ తీయాలన్న నా కోరిక ఈ చిత్రంతో తీరుతుంది' అని తెలిపారు.

Vanya Mishra to romance Kalyanram

నిర్మాత కొమర వెంకటేశ్ మాట్లాడుతూ 'మేం నిర్మించే తొలి సినిమా ఇది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఈ రోజు నుంచి ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది' అని చెప్పారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, విక్రంజిత్‌సింగ్, ఆలీ, కృష్ణభగవాన్, ఆర్.కె., రావు రమేశ్, రోహిణి, ప్రియ, వేణుమాధవ్, షఫీ, రఘుబాబు, తాగుబోతు రమేశ్, రమేశ్ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి కథ, మాటలు: డైమండ్ రత్నబాబు, రచనా సహకారం: ముద్ద నాగ, ఫొటోగ్రఫీ: సర్వేష్ మురారి, సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.బ్రహ్మానందరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X