లేడీ విలన్‌తో బాలయ్య ఫైట్.. పవర్‌ఫుల్ పాత్రలో ప్రత్యర్థి ఎవరంటే..
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే బలమైన విలన్ లేకపోతే ఆ సినిమాలో మజానే ఉండదంటారు అభిమానులు. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, ముఖేష్ రుషి లాంటి బలమైన విలన్లుగా బాలకృష్ణను ఢీ కొట్టారు. అయితే ఇప్పటి వరకు మగ విలన్లను తుక్కు తుక్కుగా రఫ్ ఆడించిన బాలయ్య.. ఇక లేడీ విలన్‌ను ఎదుర్కోబోతున్నారట. త్వరలోనే పట్టాలెక్కే కేఎస్ రవికుమార్ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ బలమైన లేడీ విలన్‌గా బాలయ్యను ఎదుర్కొబోతున్నారట. ప్రస్తుతం లేడీ విలన్ అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇటీవల కాలంలో లేడీ విలన్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ కేక పెట్టిస్తున్నారు. విజయ్, ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన సర్కార్ చిత్రంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రతో మెప్పించారు. అలాగే విశాల్ పందెంకోడి 2 చిత్రంలో పవర్‌పుల్ పాత్రలో కనిపించారు.
ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ విషయానికి వస్తే తమిళంలో భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. వెల్వెట్ నగరం, నీయా 2, రాజా పార్వాయి, కన్ని రాశి, కట్టేరి, డానీ, కన్నితీవు చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ఇక తాజా బాలయ్య సినిమాలోని పాత్రను కేఎస్ రవికుమార్ చాలా అద్భుతంగా డిజైన్ చేసినట్టు తెలుస్తున్నది.

జై సింహా తర్వాత బాలయ్య సినిమా జాబితాలోకి కేఎస్ రవికుమార్ చిత్రం అనూహ్యంగా చేరింది. వాస్తవానికి దర్శకుడు బోయపాటితో కలిసి బాలకృష్ణ ఓ ప్రాజెక్ట్‌లో నటించాల్సింది. అయితే ఆ ప్రాజెక్ట్ కాస్త వెనుకకు తగ్గడంతో కేఎస్ రవికుమార్ రంగంలోకి వచ్చారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానున్నది. ఈ చిత్రానికి సీ కల్యాణ్ నిర్మాత.


Click it and Unblock the Notifications











