Vishwambhara: చిరంజీవి సినిమాలో లక్కీ లేడీ.. విశ్వంభరకు హిట్ సెంటిమెంట్
టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలే ఇప్పుడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బడా హీరో వరుసగా మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను అందించారు. అలా గత ఏడాది 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' మూవీలతో వచ్చారు.
'భోళా శంకర్' మూవీ డిజాస్టర్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి.. ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నారు. ఇందులో భాగంగానే తన 156వ సినిమాను కల్యాణ్ కృష్ణతో ప్రకటించారు. కానీ, ఇది అనౌన్స్‌మెంట్‌కే పరిమితం అయింది. ఇప్పుడు చిరంజీవి 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న 'విశ్వంభర' మూవీ సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వెల్లడించగా.. కాన్సెప్టు పోస్టర్, గ్లింప్స్ వీడియోలోనూ అదే చూపించారు. ఇక, కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టి.. పలు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసుకున్నారు.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కావడంతో ఇందులో నటించే నటీనటుల విషయంలో క్లారిటీ రాలేదు. కానీ, ఇందులో ఫలానా స్టార్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'విశ్వంభర'లో కీలక పాత్రపై ఓ న్యూస్ బయటకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర' మూవీలో టాలీవుడ్ లక్కీ లేడీగా పేరొందిన వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈమె ఎంపిక కన్ఫార్మ్ అయిందని, త్వరలోనే షూటింగ్‌లో కూడా పాల్గొనబోతుందని తెలుస్తోంది. ఇందులో ఆమె చేసే పాత్ర గత చిత్రాల మాదిరిగానే మ్యాజిక్ చేసేలా ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ సహా మరికొందరు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. అలాగే, దగ్గుబాటి రానా విలన్‌గా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇది వచ్చే సంక్రాంతికి రాబోతుంది.


Click it and Unblock the Notifications











