బాలయ్యకే షాకిచ్చిన హీరోయిన్: నటసింహాన్నే డామినేట్ చేసిందంటే నమ్ముతారా!

ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. కొంత కాలానికే స్టార్‌గా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న ఆయన.. ఆ జోష్‌తోనే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇదే పంథాను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు బాలయ్య 'వీరసింహారెడ్డి' అనే మాస్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు ఓ హీరోయిన్ షాకిచ్చిందట. ఆ వివరాలు మీకోసం!

 బెస్ట్ మూవీగా.. ఫుల్ ఖుషీగానే

బెస్ట్ మూవీగా.. ఫుల్ ఖుషీగానే

ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే బాలయ్య.. గత ఏడాది 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా భారీ అంచనాలతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, ఈ చిత్రంతో కలెక్షన్ల పరంగా ఆయన బిగ్గెస్ట్ హిట్ అందుకుని ఖుషీగా ఉన్నారు.

వీరసింహారెడ్డిగా నటసింహం

వీరసింహారెడ్డిగా నటసింహం

'అఖండ' వంటి భారీ హిట్ తర్వాత నటసింహా బాలకృష్ణ రెట్టించిన జోష్‌తో కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం 'వీరసింహారెడ్డి' అనే ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

సినిమాలో ఎవరెవరు అంటే

సినిమాలో ఎవరెవరు అంటే

నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు.

సంక్రాంతికి టార్గెట్ పెట్టారు

సంక్రాంతికి టార్గెట్ పెట్టారు

బాలయ్య - గోపీచంద్ కాంబోలో రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీ షూటింగ్ గత ఫిబ్రవరిలో మొదలైంది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసింది. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 80 శాతం పైగా టాకీ పార్టును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

అప్పుడే భారీ ప్రీ బిజినెస్‌తో

అప్పుడే భారీ ప్రీ బిజినెస్‌తో

ఫుల్ లెంగ్త్ మాస్ మూవీగా రాబోతున్న 'వీరసింహారెడ్డి'పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్ల వల్ల ఇది మరింత రీచ్ అవుతోంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఫలితంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్.

బాలయ్యకే షాకిచ్చిన భామ

బాలయ్యకే షాకిచ్చిన భామ

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీలో ఎంతో మంది ప్రముఖులు నటిస్తోన్న విషయం తెలిసిందే. అందులో కోలీవుడ్ భామ వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒకరు. ఇందులో ఎంతో పవర్‌ఫుల్‌ రోల్‌ను చేస్తోన్న ఈ బ్యూటీ.. బాలయ్య చెల్లెలిగా కనిపించబోతుందని అంటున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. వరలక్ష్మీ ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌తో బాలయ్యకే షాకిచ్చిందట.

ఐదు పేజీలు.. మెచ్చుకుని

ఐదు పేజీలు.. మెచ్చుకుని

ప్రస్తుతం 'వీరసింహారెడ్డి' మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇందులో వరలక్ష్మీతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయని తెలిసింది. అందులో ఆమె ఏకంగా ఐదు పేజీల డైలాగులను సింగిల్‌ టేక్‌లోనే చెప్పి ఏకంగా బాలయ్యనే ఆశ్చర్యపరిచిందట. ఆమె ప్రతిభకు అవాక్కైన నటసింహా.. అందరి ముందే వరలక్ష్మీని అభినందించారని తెలిసింది. ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X