twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగులో భారీగా ఆఫర్లు అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. అఖిల్, బన్నీతో కూడా..

    |

    వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ పెద్ద కూతురైన ఈ టాలెంటెడ్ నటీమణి మెల్లమల్లగా తన స్థాయిని పెంచుకుంటోంది. ఇటీవల తెలుగులో ఆమె చేసిన క్రాక్, నాంది సినిమాలలు ఏ రేంజ్ హిట్టయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ ఊపుతోనే మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

    శంకర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ..

    శంకర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ..

    అసలైతే మొదట వరలక్ష్మికి 16 ఏళ్ల వయసులోనే అవకాశాలు చాలా వచ్చాయి. ముఖ్యంగా శంకర్ బాయ్స్ సినిమాలో జెనీలియా కంటే ముందు హీరోయిన్ గా అనుకున్నారాట. కానీ అప్పుడు ఎడ్యుకేషన్ కారణంగా సినిమాలకు చాలా దూరంగానే ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. ఇక 2012లో శింబు పోడా పొడి సినిమా ద్వారా వరలక్ష్మి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.

    ఆ సినిమాతోనే భారీ క్రేజ్

    ఆ సినిమాతోనే భారీ క్రేజ్

    అయితే వరలక్ష్మి హీరోయిన్ గా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. ఇక ఎప్పుడైతే ఆమె విజయ్ సర్కార్ సినిమాలో నెగిటివ్ రోల్ చేసిందో అప్పటి నుంచి డిమాండ్ మరింత పెరిగింది. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో తన నటనతో విజయ్ కు పోటీని ఇచ్చింది. పవర్ఫుల్ ఐరెన్ లేడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.

    క్రాక్, నాంది హిట్స్ తో..

    క్రాక్, నాంది హిట్స్ తో..

    ఇక ఇటీవల వరుసగా రెండు సినిమాలతో ఆమె ప్లాప్ లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చిందని ఇండస్ట్రీలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మాస్ రాజా రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మా అనే మాస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే 8 ఏళ్ల నుంచి హిట్టు కోసం పరితపిస్తున్న అల్లరి నరేష్ సినిమాలో ఒక లాయర్ పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

    అల్లు అర్జున్, అఖిల్ సినిమాలలో..

    అల్లు అర్జున్, అఖిల్ సినిమాలలో..

    ఇప్పుడు ఇండస్ట్రీలో పవర్ఫుల్ లేడి పాత్రల కోసం నటిగా వరలక్ష్మి అయితే బెటర్ అని దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెంటపడుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న పొలిటికల్ సినిమాలో అమ్మడు ఒక రాజకీయ నాయకురాలిగా కనిపించబోతోందట. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్న అఖిల్ కొత్త సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ పాత్రలతో వరలక్ష్మి ఇంకా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Varalaxmi Sarathkumar is a name that is heard more in Telugu now than in Tamil. The talented actress, the eldest daughter of Kollywood senior star hero Sarath Kumar, is slowly raising her status. Needless to say, her recent Telugu films Crack and Nandi have been a hit in any range. That momentum is giving the green signal to more movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X