అవతార్ 3తో మహేష్ బాబు వారణాసి డీల్.. ప్లానింగ్ అదిరింది జక్కన్న
Varanasi-Avatar 3: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi). ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్‌లో సంచలనం క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ హై యాక్షన్ అడ్వెంచర్ మూవీ విడుదల తేదీ ప్రకటించకముందే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. టెక్నీషియన్లు, పాన్ ఇండియా-పాన్ వరల్డ్ క్యాస్టింగ్, మైథాలజికల్ ఎలిమెంట్స్ అన్ని కలిసి 'వారణాసి' మూవీని వర్డల్ వైడ్ గా చర్చనీయంగా మార్చేశాయి. ఈ మూవీని గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి రూపొందిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా అవతార్ 3తో వారణాసి మూవీని లింక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ పుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని రాజమౌళి భారీ భారీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ లాంచ్ చేయడానికి గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఓ బిగ్ ఈవెంట్ నిర్వహించాడు. కాగా వారణాసి సినిమాతో మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలో మహేష్ బాబు వారణాసి సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి ఓ సూపర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వారణాసి మూవీని గ్లోబల్ స్థాయిలో ప్రమోషన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రూపొందించిన 'అవతార్ 3 (Avatar: Fire and Ash) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న గ్రాండ్ గా విడుదల కానుంది. సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌కు 'వారణాసి' టీజర్‌ను జత చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండియాతో పాటు ఎంపిక చేసిన కొన్ని దేశాలలో 'అవతార్ 3' ఇంటర్వెల్ సమయంలో 'వారణాసి' టీజర్ ప్రదర్శించనున్నారట.
ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం రాజమౌళి, జేమ్స్ కామెరూన్ మధ్య ఉన్న స్నేహమే. అందుకే వీరిద్దరి మధ్య డీల్ జరిగినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 'RRR' సినిమాను చూసిన తర్వాత హాలీవుడ్ డైరెక్టర్ జెమ్స్ కామెరూన్ పలు సందర్భాల్లో రాజమౌళిని పొగిడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 'RRR' డాక్యుమెంటరీలో కూడా కామెరూన్ పాల్గొని రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ సంబంధం కారణంగానే వారణాసి టీజర్‌ను హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీతో కలపనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
వారణాసి సోర్టీ భారతీయ పురాణాలు, వారణాసి ఘాట్స్, శివభక్తుడి ఆధ్యాత్మిక ప్రయాణం వంటి అంశాల చూట్టు తిరుగుతుంది. ఐమాక్స్ కెమెరాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే టైటిల్ టీజర్ ద్వారా సంకేతాలు ఇచ్చాడు. ఈ విజువల్ గ్రాండియర్, మైథాలజీకల్ మిస్టిసిజం 'అవతార్' సిరీస్ ప్రపంచంతో సారూప్యం కలిగి ఉండటంతో ఈ రెండు చిత్రాలు కలిసి ప్రమోట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఒక వేళ అవతార్ - వారణాసి సినిమాల మధ్య డీల్ జరిగితే.. వారణాసి మూవీకి అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రచారం లభిస్తుంది. అలాగే.. మహేష్ బాబు గ్లోబల్ లెవల్ హీరోగా ఎదగడానికి ఇది ఒక కీలక మలుపు అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వారణాసి సంబంధించిన క్లింప్స్ ట్రెండ్ అవుతుండటం చూస్తే..ఈ మూవీపై ఎన్ని అంచనాలు నెలకొన్నాయో అర్థమవుతుంది. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రకటన ఎప్పుడు వస్తుందో అన్న ఆసక్తి ప్రపంచ సినీ ప్రేమికుల్లో పెరుగుతోంది.


Click it and Unblock the Notifications











