Varanasi: వారణాసి సరికొత్త రికార్డ్.. రాజమౌళి-మహేష్ మూవీ బడ్జెట్ అన్ని కోట్లా?

Varanasi: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం'వారణాసి'. ఈ ఎపిక్ యాక్షన్-అడ్వెంచర్ మూవీపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ కొనసాగుతోంది. గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది. ఈ మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మూవీ వారణాసి విడుదలకు ఇంకా ఏడాదికి పైగానే సమయం ఉన్నప్పటికీ అప్పుడే ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో దీని గురించిన చర్చలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా వారణాసి మూవీ బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వారణాసి మూవీ బడ్జెట్ ఎన్ని కోట్లంటే?

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీగా 'వారణాసి'రికార్డు సృష్టించింది. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఇండియన్ స్క్రీన్‌పై తిరిగి కనిపించబోతుంది హీరోయిన్ ప్రియాంక చోప్రా. అలాగే.. ఈ ఎపిక్ యాక్షన్-అడ్వెంచర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మాధవన్ వంటి స్టార్ నటులు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Varanasi Budget Creates History SS Rajamouli-Mahesh Babu Film Made on 150 Million

బడ్జెట్ పరంగా చూస్తే.. మ్యాన్ ఆఫ్ విజన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్-అడ్వెంచర్ మూవీని ఏకంగా 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1361 కోట్లు) బడ్జెట్‌తో నిర్మించారన్న హాలీవుడ్ మీడియా అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇప్పటివరకు వచ్చిన అన్ని ఇండియన్ సినిమాల రికార్డులను 'వారణాసి'మూవీ బ్రేక్ చేసి, టాప్ ప్లేస్‌లో నిలిచింది.

అలాగే.. ఈ మూవీతో రాజమౌళి తన పాత రికార్డునే తానే బద్దలు కొట్టారు. 'RRR' సినిమా సుమారు రూ. 600 కోట్లతో తెరకెక్కగా, ఇప్పుడు 'వారణాసి' దాదాపు రెట్టింపు వ్యయంతో రూపొందుతోంది. దీనికి ప్రధాన కారణం విస్తృతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు, అలాగే లాంగ్ షూటింగ్ షెడ్యూల్. ఈ మూవీని భారత్‌తో పాటు కెన్యా అడవులు సహా ఏడు దేశాల్లో షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు, అంటార్కిటికాలో షూట్ చేసిన అరుదైన ఇండియన్ సినిమాల్లో ఇదీ ఒకటిగా నిలవనుంది.

ఇంత భారీ బడ్జెట్ నేపథ్యంలో నటీనటుల పారితోషికాలు కూడా పెరిగినట్టు సమాచారం. అయితే రాజమౌళి మాత్రం ఈ సినిమాకు డైరెక్ట్ రెమ్యునరేషన్ తీసుకోలేదని టాక్. దానికి బదులుగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారట, వీటి విలువ సుమారు రూ. 160 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ట్రైలర్, ప్రమోషన్స్ బలంగా క్లిక్ అయితే ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే... ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న దర్శకుడిగా రాజమౌళి నిలిచే ఛాన్స్ ఉంది. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవనున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X