Varanasi Business: వారణాసి రైట్స్ కోసం భారీ పోటీ.. మైత్రీ టెంప్టింగ్ ఆఫర్!

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న విజువల్ వండర్‌ 'వారణాసి'. ఈ మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో గ్లోబల్ మార్కెట్‌ను దక్కించుకున్న రాజమౌళి... ఇప్పుడు 'వారణాసి'తో మరోసారి గ్లోబల్ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, టాలీవుడ్‌లో భారీ సంచలనం రేపే ప్రాజెక్ట్‌గా 'వారణాసి' సినిమా నిలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి అంతకుమించి అనేలా డీల్స్ వస్తున్నాయట.

వారణాసి సినిమాకు సంబంధించిన ప్రీ-గ్లింప్స్ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న సందేహాలు ఒక్కసారిగా తొలగిపోయి, సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. విజువల్స్, కాన్సెప్ట్, స్కేల్ అన్ని కలిపి ఈ మూవీపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. దీంతో దేశీయంగానే కాదు, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు.

Varanasi Business Mythri Movie Makers Big Offer for Mahesh Babu Rajamouli Film

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది 'వారణాసి' బిజినెస్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ రేసులో ముందంజలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సంస్థ వారణాసి మూవీ యూనిట్‌కు భారీ స్థాయిలో టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినట్లు టాక్. ఈ డీల్ ఫైనల్ అయితే టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక థియేట్రికల్ డీల్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమా నిర్మాణం కూడా అదే స్థాయిలో గ్రాండ్‌గా సాగుతోంది. దాదాపు రూ.1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, టెక్నికల్‌గా, విజువల్‌గా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, ఆగస్ట్ నాటికి టాకీ పార్ట్ పూర్తి చేసి, ఆ తర్వాత భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ రిలీజ్‌ను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

కాస్టింగ్ పరంగా కూడా 'వారణాసి' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించబోతుండగా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడనే టాక్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న డిమాండ్‌ను చూస్తే... విడుదలకు ముందే భారీ స్థాయిలో రికవరీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాల నుంచి రికార్డు స్థాయి ఆఫర్లు వస్తుండగా, యూనిట్ మాత్రం తొందరపడకుండా ప్రతి డీల్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇలా 'వారణాసి' కేవలం సినిమా మాత్రమే కాదు... టాలీవుడ్‌ను మరోసారి గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టే ప్రాజెక్ట్‌గా మారబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఆఫర్‌ను రాజమౌళి అంగీకరిస్తారా? లేదా మరింత పెద్ద డీల్ కోసం వేచి చూస్తారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X