Varanasi: జక్కన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. మహేష్ ఎన్ని పాత్రలలో కనిపించబోతున్నారంటే?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, విజన్‌రీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి( Varanasi). ఈ భారీ బడ్జెట్ మూవీ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా రాజమౌళి, మహేశ్ కాంబో అనే మాటే ఇండియన్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న తదుపరి ప్రాజెక్ట్ కావడం, అలాగే.. మహేశ్ బాబు తన కెరీర్‌లో మొదటి రాజమౌళి సినిమా ఇదే. దీంతో వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ బజ్ వైరలవుతోంది. ఇంతకీ జక్కన్న మాస్టర్ ప్లాన్ ఏంటీ ?
వారణాసి సినిమాను ప్రపంచస్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. అందుకే బడ్జెట్ కూడా ఓ అంచనాలకే కాకుండా అసలు ఊహించని లెవెల్లో ఉండబోతుందట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వివరాల ప్రకారం..వారణాసి బడ్జెట్ 1500 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. అధికారికంగా ఏమైనా ధృవీకరణ రాకపోయినా, ఈ రూమర్లు ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతున్నాయి.

ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్,హాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా నటిస్తోందనే సమాచారం ఇప్పటికే హాట్ టాపిక్. ఆమె 'మందాకిని' అనే పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. అలాగే కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ నటుడు మాధవన్ హనుమంతుడి పాత్రలో నటించబోతున్నారన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
ఇక మహేశ్ బాబు.. కేవలం తెలుగు మాత్రమే కాక పాన్ ఇండియా హీరోరేంజ్‌కు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ సినిమా ఉండబోతుందనే ప్రిన్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌తో రాజమౌళికి అంతర్జాతీయ సినిమా వరల్డ్ లో ప్రత్యేక స్థానం లభించిందో, వారణాసికి అంతకు మించి అనేలా భారీ రికార్డులు క్రియేట్ చేస్తుందనీ, బాక్సాఫీస్ షేక్ కాబోతుందనే హైప్స్ క్రియేట్ అవుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఇటీవల సోషల్ మీడియాలో వరుసగా వస్తున్న వార్తల ప్రకారం మహేశ్ బాబు ఈ సినిమాలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇందులో ప్రధానంగా 'రుద్ర'అనే పాత్రలో కనిపిస్తారని టాక్. ఇప్పటికే రాజమౌళి, మహేశ్ బాబును శ్రీరాముడిగా ప్రెజెంట్ చేయబోతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మహేశ్ బాబును రాముడిగా చూసిన వెంటనే 'రాజసం' కనిపించిందని రాజమౌళి వెల్లడించాడనే సమాచారం సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. మిగిత మూడు పాత్రలేంటీ? అని చర్చనీయంగా మారాయి.
ప్రస్తుతం వారణాసి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2027 వేసవి సీజన్‌లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడమే మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియో, టైటిల్ అనౌన్స్‌మెంట్ వారణాసి సినిమాకి భారీ స్కేల్‌ను చూపించాయి. ఇక మహేశ్ బాబు ఐదు పాత్రల్లో కనిపిస్తారన్న వార్త ఎంతవరకు నిజమో మాత్రం అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం జక్కన్న-మహేశ్ కాంబినేషన్ మూవీపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలా రోజుకో కొత్త బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ తరహాలో ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











