Varanasi: వారణాసిలో మహేష్ బాబు నట విశ్వరూపం.. శ్రీ రాముడే కాదు ఆ పాత్రలతో రాజమౌళి మాస్టర్ ప్లాన్..

Varanasi: భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యధిక హైప్ క్రియేట్ చేస్తున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi). టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మహా ఎపిక్ విడుదలకు ముందే గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. టైటిల్ గ్లింప్స్‌లో మహేష్ కనిపించిన 'రుద్ర' లుక్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని స్పష్టమైంది. ఇలా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటీ?

తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇప్పటికే రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడి అవతారంలోనూ ఆయన దర్శనమివ్వనున్నట్టు మహేష్ స్వయంగా హాలీవుడ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు శివుడి ఛాయలున్న పాత్ర కూడా ఉంటుందని టాక్.

Varanasi Movie Mahesh Babu Five Roles Ram Avatar Trimurti amp amp Aghora Mystery Rajamouli s Global Epic

ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే.. ఈ ఐదు పాత్రల వెనుక బ్రహ్మ-విష్ణు-మహేశ్వర (త్రిమూర్తులు) కాన్సెప్ట్ దాగి ఉందని, పురాణాల స్ఫూర్తిని ఆధునిక టైమ్ ట్రావెల్ థీమ్‌తో రాజమౌళి పవర్‌ఫుల్‌గా మిక్స్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్రల్లో కూడా మహేష్ బాబు కనిపించనున్నారా? లేదా? మరో నటుడు పోషించనున్నారనేది కూడా సస్పెన్స్ గా మారింది.

ఈ సినిమాలో రామాయణం నుంచి ప్రేరణ పొందిన సుమారు 25 నిమిషాల మైథాలజీ ఎపిసోడ్ ప్రధాన హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ఈ భాగాన్ని వారణాసిలోనే దాదాపు 60 రోజుల పాటు షూట్ చేశారట. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో 'మహేష్‌ను రాముడిగా చూసినప్పుడు నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. ఆ సీక్వెన్స్ నా కెరీర్‌లోనే గుర్తుండిపోయేలా ఉంటుంది' అని చెప్పడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ మూవీకి అదనపు ఆకర్షణ. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో కనిపిస్తుండగా, విలన్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. మహేష్ తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్, మరో కీలక పాత్రలో మాధవన్ కనిపించనున్నారు. కథ మొత్తం వారణాసి నేపథ్యంతో సాగుతూ మైథాలజీ, యాక్షన్, అడ్వెంచర్, టైమ్ ట్రావెల్ అంశాలతో రూపొందుతోంది.

ఇవన్నీ కాకుండా సినిమాలో ఓ అఘోరా క్యారెక్టర్ కూడా ఉందన్న ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉండగా, ఫ్యాన్స్ మధ్య ప్రభాస్ కేమియో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇక టెక్నికల్‌గా 'వారణాసి' మరో స్థాయిలో రూపొందుతోంది. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, హాలీవుడ్ టెక్నీషియన్లు విజువల్స్, VFX, యాక్షన్ సీక్వెన్స్‌లను అంతర్జాతీయ ప్రమాణాల్లో తీర్చిదిద్దుతున్నారు. IMAX ఫార్మాట్‌లో కూడా సినిమా విడుదల కానుంది.

ఇక బడ్జెట్ విషయానికొస్తే .. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే రూ.1000-1300 కోట్ల మధ్యకు చేరిందని టాక్. షూటింగ్ 2026 సమ్మర్ నాటికి కీలక దశ పూర్తి చేసి, భారీ పోస్ట్ ప్రొడక్షన్ అనంతరం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా రుద్రుడు, రాముడు, త్రిమూర్తుల ఛాయలు, అఘోరా మిస్టరీ, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇవన్నీ కలిపి 'వారణాసి' కేవలం సినిమా కాదు... ఒక గ్లోబల్ సినిమాటిక్ ఈవెంట్‌గా మారబోతోందన్నది స్పష్టం. 2027లో ఈ మూవీ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాల్సిందే!

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X