Varanasi: వారణాసి కోసం మహేష్‌ బాబు కఠోర సాధన.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Varanasi: యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టులలో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' ఒకటి. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమా గ్లోబల్ లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మహేష్ బాబు 'రుద్ర' లుక్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పించగా, రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీ నుంచి వచ్చే చిన్న బజ్ అయినా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా మహేశ్ బాబు గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ సంగతేంటీ?

ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు 'రుద్ర' అనే సూపర్ మ్యాన్ పాత్రలో కనిపించనున్నారు, కథానాయికగా ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో నటిస్తుండగా.. ఇక మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే విలన్ పాత్రలో కనిపించనుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. మహేష్ బాబు తండ్రి పాత్రలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు సమాచారం, ఇది కథలో భావోద్వేగాలకు గట్టిపునాది అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అంతేకాదు, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములవుతున్నారు.

Varanasi Movie Mahesh Babu s Kalaripayattu Training

'వారణాసి' మూవీలోని కీలక యాక్షన్ సన్నివేశాల కోసం మహేష్ బాబు ప్రస్తుతం కలరిపయట్టు అనే పురాతన యుద్ధ విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కేరళలో ఉద్భవించిన ఈ యుద్ధ కళకు సుమారు 3000 ఏళ్ల చరిత్ర ఉంది. దీనిని అన్ని యుద్ధ కళలకు మాతృకగా కూడా పిలుస్తారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కలరిపయట్టు ట్రైనర్ హరికృష్ణన్ మహేష్‌కు ఈ శిక్షణ తీసుకున్నారట. తాజాగా ఆయన మహేష్ బాబుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుని, "భారతీయ సినిమా సూపర్ స్టార్‌కు శిక్షణ ఇవ్వడం గర్వంగా ఉంది. ఆయన జీవనశైలి, వినయం నాకు చాలా ఇన్‌స్పిరేషన్" అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కలరిపయట్టు విద్యలో నిష్ణాతుడు కావడం విశేషం. గతంలో 'ఆనందభద్రం' వంటి సినిమాల్లో ఆయన ఈ యుద్ధ కళను ప్రదర్శించారు. దీంతో 'వారణాసి'లో మహేష్-పృథ్వీరాజ్ మధ్య కలరిపయట్టు ఆధారిత యాక్షన్ సన్నివేశాలు ఉండొచ్చన్న అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వారణాసి మూవీ ఏడాదిగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా, మరో ఎనిమిది నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం దాదాపు 8 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి, 2027 సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా బడ్జెట్‌పై ఇప్పటికే భారీ చర్చ నడుస్తోంది. మొదట రూ.1000 కోట్లు అని ప్రచారం జరిగినా, తాజాగా రూ.1300 కోట్ల వరకు బడ్జెట్ వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయమై ప్రశ్న ఎదురవ్వగా ప్రియాంక చోప్రా చమత్కారంగా సమాధానం దాటవేసి నవ్వులు పూయించారు. అయితే ట్రేడ్ వర్గాల ప్రకారం, ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. మొత్తానికి 'వారణాసి' కేవలం ఓ సినిమా కాదు... ఇది భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రయత్నం. మహేష్ బాబు తీసుకుంటున్న కలరిపయట్టు ట్రైనింగ్, రాజమౌళి మాస్టర్ ప్లానింగ్, హాలీవుడ్ టెక్నికల్ హంగు అన్ని కలిసి ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటిస్తున్నాయి. 2027‌లో విడుదలయ్యే ఈ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: mahesh babu rajamouli Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X