Varanasi: మహేష్ బాబుకు తండ్రిగా స్టార్ యాక్టర్..జక్కన్న ప్లాన్ అదుర్స్!
Varanasi Movie : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'వారణాసి' పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాజమౌళి సినిమా అంటేనే ఎక్కడలేని అంచనాలు పెరుగుతారు. అందులోనూ తొలిసారి మహేష్‌బాబుతో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రత్యేక దృష్టి పడింది. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన మహేష్ ఫస్ట్‌లుక్, 'వారణాసి ' గ్లింప్స్ సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. విజువల్స్, టోన్, మైథాలజీ అడ్వెంచర్ అన్నీ కలిసి ఇది రాజమౌళి కెరీర్‌లో మరో మైలురాయిగా మారబోతుంది. ఇలా సినిమాకు సంబంధించిన ఓ బజ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
తాజాగా సోషల్ మీడియాలో మరో కీలక అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్‌బాబు తండ్రి పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఆ పాత్ర కోసం రాజమౌళి పలువురు సీనియర్ నటులతో లుక్ టెస్టులు నిర్వహించారనే సమాచారం ముందే బయటకు వచ్చింది. కానీ తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ పాత్రకు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఫైనల్ చేశారనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ప్రకాశ్ రాజ్ ఇప్పటికే షూటింగ్ లొకేషన్‌లో అడుగుపెట్టారని, ఆయనపై కొన్ని ముఖ్యమైన సీన్స్ షూట్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో 'మహేష్ తండ్రిగా ప్రకాశ్ రాజ్' అన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది.

ఈ కాంబినేషన్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ కూడా ఈ హైప్‌కు కారణం. గతంలో మహేష్‌బాబు-ప్రకాశ్ రాజ్ కలిసి ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఖలేజా, బిజినెస్ మ్యాన్, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, గుంటూరు కారం వంటి అనేక సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో ప్రకాశ్ రాజ్ మహేష్‌కు తండ్రిగా నటించి, మెప్పించారు. ఇప్పుడు అదే తండ్రి-కొడుకు బంధం రాజమౌళి స్కేల్‌లో మరోసారి రూపుదిద్దుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.'హిట్ కాంబినేషన్ రీటర్న్స్'అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
మొదట్లో ఈ పాత్రకు మాధవన్ పేరు వినిపించినప్పటికీ, ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా స్పష్టమైంది. మాధవన్ ఈ చిత్రంలో మరో కీలకమైన మైథాలజికల్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడనే సమాచారం ఉంది. కథ పరంగా చూస్తే, మహేష్‌బాబు ఈ సినిమాలో సాహస అన్వేషకుడు 'రుద్ర'గా కనిపించనుండగా, ఐదు విభిన్న పాత్రల్లో నటించబోతున్నారట. రాజమౌళి ఇప్పటికే మహేష్‌ను రాముడిగా చూపించబోతున్నట్టు వెల్లడించడంతో, కథకు మైథాలజికల్ బలమే ప్రధాన ఆకర్షణగా మారింది.
పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న 'వారణాసి'లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, విలన్ 'కుంభ'గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027 సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ మొదలవ్వడం విశేషం. తాజా అప్‌డేట్స్ చూస్తుంటే, రాజమౌళి విజన్, మహేష్‌బాబు స్టార్ పవర్ తో 'వారణాసి' నిజంగానే గ్లోబల్ సినిమా మారబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











