Varanasi: వారణాసిలో కాంట్రవర్సీ స్టార్ ? జక్కన్న వేరే లెవెల్ ప్లాన్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi). దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను షో యూ బ్యానర్‌పై ఎస్.ఎస్. కార్తికేయ, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'వారణాసి', మరో ఆరు నుంచి ఏడు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకునే దిశగా వెళ్తోంది. ఇప్పటికే గ్లోబల్ లెవల్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచి ప్రతి చిన్న అప్డేట్ వైరల్ అవుతుండటమే ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. తాజాగా ఓ కాంట్రవర్సీ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇంతకీ ఆ స్టార్ ఎవరు?

వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కాకుండా ఈయన మరో నాలుగు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక విలన్ పాత్రలో కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు కాసేపు రాముడిగా కనిపిస్తాడన్న విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. పృథ్వీరాజ్ ఈ మూవీలో 'కుంభ' అనే పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్ పాత్రలో కనిపించనున్నట్టు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

Varanasi Movie Update Deepika Padukone Rumors Add Buzz to Rajamouli-Mahesh Babu Film

ఇటీవల మేకర్స్ అధికారికంగా 'వారణాసి' 2027లోనే విడుదల కానుందని ప్రకటించడంతో, ఇప్పటికే నడుస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది. అయితే రాజమౌళి సినిమాలు చెప్పిన సమయానికి రావడం అరుదు. 2027 రిలీజ్‌పై నెటిజన్లు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 9న, శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నారట. మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించే సన్నివేశాలు ఉండటమే ఈ డేట్ ఎంపికకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే (Deepika Padukone) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పృథ్వీరాజ్ పాత్రకు జోడీగా లేదా మహేష్ సరసన హీరోయిన్‌గా దీపిక కనిపించవచ్చన్న వేరువేరు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు, వర్కింగ్ హవర్స్, రెమ్యూనరేషన్ అంశాలపై ఇటీవల కాంట్రవర్సీల్లో ఉన్న దీపికను జక్కన్న కావాలనే ఎంపిక చేసుకున్నాడా? అన్న చర్చ కూడా నడుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రూమర్స్‌లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మేకర్స్ ఇప్పటికే తమ ప్లానింగ్‌పై పూర్తి క్లారిటీతో ముందుకెళ్తున్నారని, అధికారిక ప్రకటన వచ్చే వరకు దీపిక ఎంట్రీపై నమ్మకంగా ఏమీ చెప్పలేమని అంటున్నారు. అయినప్పటికీ, 'వారణాసి' లాంటి ప్రాజెక్ట్‌కు సంబంధించి చిన్న పుకారు కూడా భారీ సెన్సేషన్‌గా మారడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరోసారి రుజువు చేస్తోంది. ఈ వార్తలో ఎంత నిజముందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X