Varanasi OTT: దిమ్మతిరిగే రేంజ్‌లో 'వారణాసి' మూవీ ఓటీటీ డీల్.. అన్ని వందల కోట్లా?

Varanasi OTT: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi). ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులే కాదు... ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం 'వారణాసి' విశేషాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారణాసి మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్స్ హాట్ టాపిక్ గా మారింది.

వారణాసి మూవీ మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ స్టార్ కాస్టింగ్ చూసి ట్రేడ్ వర్గాలు ఇప్పటికే బాక్సాఫీస్ రికార్డులు ఖాయమని అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు బిజినెస్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టించబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Varanasi OTT Deal Mahesh Babu- Rajamouli Film in Talks with Netflix for 650 Crore Digital Rights

ఒక్క పార్టే... మూడు గంటలకుపైగా రన్‌టైమ్
ఇటీవల సోషల్ మీడియాలో 'వారణాసి' రెండు భాగాలుగా విడుదల అవుతుందనే రూమర్స్ చక్కర్లు కొట్టాయి. దీనిపై స్వయంగా రాజమౌళి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...'కథ పెద్దదిగా ఉండటంతో ఒక దశలో రెండు పార్ట్స్ ఆలోచన వచ్చింది. కానీ చివరకు సింగిల్ పార్ట్‌గానే తెరకెక్కించాలని నిర్ణయించాం. రన్‌టైమ్ సుమారు మూడు గంటలకుపైగా ఉంటుంది' అని వెల్లడించారు. దీంతో 'వారణాసి పార్ట్-2' ప్రచారానికి అధికారికంగా చెక్ పడింది.

అలాగే.. ఈ సినిమాలో దాదాపు 25 నిమిషాల పాటు పురాణ నేపథ్యంతో సాగే కీలక సన్నివేశాలు ఉంటాయని రాజమౌళి తెలిపారు. రామాయణం నుంచి ప్రేరణ పొందిన కొన్ని ఎపిసోడ్‌లను నేరుగా చూపించనున్నారట. భారతీయ మూలాలు ఉండేలా, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కనెక్ట్ చేసే యూనివర్సల్ ఎమోషన్స్‌తో కథను డిజైన్ చేశామని జక్కన్న చెప్పారు. అలాగే.. కొన్ని సన్నివేశాల్లో రాముడి ఛాయలు కనిపిస్తాయని కూడా టాక్. ఇదివరకెప్పుడూ చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూడబోతున్నారని అభిమానులు అంటున్నారు.

రూ.1300 కోట్ల బడ్జెట్... ప్రమోషన్లకే రూ.200 కోట్లు?
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం 'వారణాసి' దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అంతేకాదు... కేవలం ప్రమోషన్ల కోసమే సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. RRR తరహాలోనే ఈ సినిమాను కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే రాజమౌళి వ్యూహంగా తెలుస్తోంది. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఐ మాక్స్ ( IMAX) ఫార్మాట్‌లో విడుదల కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఓటీటీ డీల్?
తాజా సంచలన ప్రచారం ఏంటంటే... అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్ ఫిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.650 నుంచి 700 కోట్ల వరకు ఆఫర్ పెట్టిందట. ఒకవేళ ఈ డీల్ ఫైనల్ అయితే... భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓటీటీ ఒప్పందంగా నిలుస్తుంది. అయితే, మేకర్స్ ఈ ఆఫర్‌ను తిరస్కరించి దాదాపు రూ.1000 కోట్ల వరకు ఆశిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు.. రాజమౌళి మాత్రం థియేట్రికల్ రన్‌కు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ... విడుదలైన కనీసం 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X