Varanasi OTT Rights: మహేష్‌బాబు వారణాసికి రికార్డు బిజినెస్.. డిజిటల్ రైట్స్‌కు ఇన్ని కోట్లా?
Varanasi OTT Rights: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi). ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది ప్రకటించకముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వారణాసి షూటింగ్ దశలో ఉన్నప్పటి నుంచే రాజమౌళి గ్లోబల్ స్థాయిలో మార్కెట్ ప్లానింగ్ చేస్తున్నారట. ఈ మూవీలో హాలీవుడ్ టెక్నీషియన్లు, పాన్ ఇండియా-పాన్ వరల్డ్ క్యాస్టింగ్, మైథాలజికల్ ఎలిమెంట్స్ అన్ని కలిసి 'వారణాసి' మూవీని వర్డల్ వైడ్ గా చర్చనీయంగా మార్చేశాయి. అయితే.. తాజాగా వారణాసి ఓటీటీ డీల్ హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వారణాసి ఓటీటీ రైట్స్ పై భారీ రూమర్స్ వినిపిస్తున్నాయి. వారణాసి ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. సోషల్ మీడియా టాక్ ప్రకారం వారణాసి మూవీ అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 650 కోట్ల భారీ బిడ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ భారీ మొత్తం భారతీయ సినిమాల ఓటీటీ చరిత్రలోనే అత్యంత భారీ ఆఫర్. అయితే రాజమౌళి, నిర్మాణ సంస్థ మాత్రం ఈ డీల్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా మరింత వెయిట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

ఇందుకు ప్రధాన కారణం.. రాజమౌళి సినిమాలకు ఉన్న గ్లోబల్ డిమాండ్. బాహుబలి, RRR వంటి సినిమాల విజయాల తర్వాత రాజమౌళి రూపొందించే ప్రతి ప్రాజెక్ట్‌కి ప్రపంచ స్థాయిలో భారీ మార్కెట్ ఉంటుంది. RRR హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు ఏడాది పాటు టాప్ ట్రెండింగ్‌లో ఉండటం, అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లకు రాజమౌళి సినిమాలపై ప్రత్యేక నమ్మకం కలిగించింది. ఈ కారణంగా వారణాసి ఓటీటీ రైట్స్‌ను రూ. 1000 కోట్లకు విక్రయించాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటి వరకు భారతీయ సినిమాలపై వచ్చిన అత్యధిక ఓటీటీ డీల్స్‌ను పరిశీలిస్తే.. కల్కి 2898 AD సినిమాకు రూ. 375 కోట్లు, KGF చాప్టర్ 2 మూవీకి రూ. 320 కోట్లు, RRR మూవీకి రూ. 300 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ రికార్టులను దృష్ట్యా మహేష్ బాబు- రాజమౌళి వారణాసి మూవీ ఓటీటీ రైట్స్ పై రూ.1000 కోట్ల డీల్ రూమర్ చాలా పెద్దదే. అయినప్పటికీ, రాజమౌళి స్థాయి, మహేష్ బాబు గ్లోబల్ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుంటే.. ఈ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశముందని టాక్.
అలాగే వారణాసికి సంబంధించిన మార్కెటింగ్ వ్యూహాలు కూడా గ్లోబల్ దిశగా ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేయడం, సౌదీ అరేబియా, కేరళ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తీసుకోవడం, ఇప్పటికే కీరవాణి స్వరపరిచిన 'సంచారి' పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలవడం, రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అంచనాలు అమాంతం పెరగడం. అలాగే.. హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందడటంతో అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ ఏ లుక్‌లో కనిపిస్తాడు? రాముడి కాన్సెప్ట్‌ను రాజమౌళి ఎలా డీల్ చేస్తాడు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
మొత్తం మీద...వారణాసి ఓటీటీ డీల్స్ గురించి అధికారిక సమాచారం రాకపోయినా ఈ స్థాయిలో చర్చ మొదలైందంటే మూవీపై ఉన్న అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో అర్థమవుతోంది. ఏదిఏమైనా రాజమౌళి మార్కెటింగ్ విజన్, మహేష్ బాబు గ్లోబల్ ఇమేజ్ కలిసినప్పుడు ఏ స్థాయి రికార్డులు క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











