గంగా నదిని హైదరాబాద్ తీసుకొస్తున్న మాస్ డైరెక్టర్.. బాలయ్య కోసం రిస్క్‌కు సిద్ధం

వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. గత ఏడాది ఆయన ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు బడా హిట్లు ఇచ్చిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఇది తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అందులో ఒకటి పవర్‌ఫుల్ రైతు పాత్ర కాగా, రెండో అఘోరా రోల్ అని చిత్ర యూనిట్ ఇది వరకే హింట్ ఇచ్చింది. ఇక, ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కోసం వారణాసిలో భారీ షెడ్యూల్‌ను జరుపుకోనున్నట్లు కూడా గతంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అక్కడ షూటింగ్ జరపాలని భావిస్తోన్న తరుణంలో కరోనా వైరస్ దానికి ఆటంకం కలిగించింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది.

Varanasi Set in Hyderabad for Boyapati Srinu - Nandamuri Balakrishna Movie

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోనే వారణాసిని పోలిన సెట్ వేయబోతున్నారట. గంగా నది సెటప్‌ను కూడా డిజైన్ చేశారని అంటున్నారు. దీని కోసం భారీగా ఖర్చు చేయబోతున్నాడట నిర్మాత రవీందర్ రెడ్డి. ఇక, ఈ సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. కానీ, ప్రగ్యా జైస్వాల్, పూర్ణలను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య విడుదలైన చిత్ర టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X