వర్మ 'దొంగల ముఠా' ఐదు రోజుల షూటింగ్ నిజం కాదా?
రవితేజ, చార్మి కాంబినేషన్ లో రామ్ గోపాల్ వర్మ కేవలం ఐదు రోజుల్లో తీసానంటున్న 'దొంగలముఠా' విషయంలో కొత్త నిజం ఒకటి బయిటకు వచ్చింది. ఈ చిత్రం మొదటి ఆయన చెప్పినట్లుగా ఐదురోజుల్లో చుట్టేసినా ఆ తర్వాత రష్ చూసుకుని షాక్ అయిన వర్మ మళ్ళీ రీషూటింగ్ పెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఐదు రోజుల్లో చుట్టేసిన ఆ రష్..చాలా గందరగోళంగా రావటంతో వెంటనే రీషూట్ ప్రారంబించాడని చెప్తున్నారు. మరో మూడు రోజుల పాటు మళ్ళీ సైలెంట్ గా రీషూట్ చేసి ఇప్పుడు విడుదలకు సిద్దం చేస్తున్నాడంటున్నారు. ఈ విషయమై నిర్మాత కూడా చాలా గుర్రుగా ఉన్నాడంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ..అప్పల్రాజు నిర్మించిన కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పల్రాజు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఈ చిత్రం విషయంలోనూ ఆయనకు అప్పుడే భయాలు మొదలయ్యాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా గురించి వర్మ... నాకు తెలిసి కెమెరామెన్ సరిగ్గా తీయలేకపోతే సినిమా ఆలస్యమవుతుంది. లేదంటే స్క్రిప్ట్ రెడీకాక పోవటం. నటీనటుల వల్ల ఆలస్యమనేది ఎప్పుడూ ఉండదు అన్నారు. " దొంగలముఠా" చిత్రం షూటింగ్ మొదటే చెప్పినట్లుగా కేవలం ఐదు రోజుల్లో ,కేవలం ఎనిమిది మంది క్రూ మెంబర్స్ తో దిగ్విజయంగా పూర్తి చేసారు. ఇది ఎంతవరకూ నిజమా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.


Click it and Unblock the Notifications











