సెక్సీనెస్ కి వర్మ నిర్వచనం
రామ్ గోపాల్ వర్మకి షాకింగ్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చి సంచలనం రేపుతూండటం అంటే భలే ఇష్టం. ప్రస్తుతం ఏక్తాకపూర్ పై విచిత్రమైన కామెంట్ పాస్ చేసి అందరి దృష్టిలో పడ్డాడు." ఏక్తా చాలా సెక్సిగా ఉంటుంది. నేను ఆమె కి గొప్పఆరాధకుడ్ని. ఎందుకంటే నా దృష్టిలో సెక్సీగా ఫీలవటానికియేమేం లక్షణాలు ఉండాలని ఆశిస్తానో అవన్నీ ఆమెలో ఉన్నాయి. అందులోనూ ఆమె చిన్న వయస్సులోనే స్వయం ప్రతిభతో టి.వి.రంగలో ఎంతో ఎత్తుకు ఎదిగటం సామాన్యమైనదా " అంటున్నాడు. దాంతో ఇది విన్న వాళ్ళందరూ రెండు వాక్యాలకి సమన్వయం కుదరక కన్ఫూజన్ కి గురిఅయ్యారు.
దాంతో వారంతా ఆయన వెంటపడి "అవునూ మీ దృష్టిలో సెక్సీ నెస్ అన్న పదానికి అర్ధమేంటి?" అని క్యూరియాసిటితో తట్టుకోలేక అడిగారు. దానికి వర్మ నవ్వుతూ "ఎరవయితే చాలా తెలివి తేటలు కలిగిఉండి ఇంటిల్ జెంట్ గా ఉంటారో , ఏ వత్తిడికి లొంగని స్థిరమైన మనస్సు కలిగి ఉంటారో వారు నాకు సెక్సీ గా కనిపిస్తూంటారు... నా దృష్టిలో క్యారెక్టర్ అంటే అదే. అంతేగాని శరీర ఆకర్షణ..అందం కాదు!" అని సెలవిచ్చాడుట. ఇదంతా ఏక్తా 'సర్కార్ రాజ్' ప్రోమోలు చూసి వర్మకి బ్లాంక్ చెక్ పంపి ఎంత ఖర్చయినా ఫర్వాలేదు..నాకు సినిమా తీసి పెట్టండి అని అడిగినప్పుడు జరిగింది.


Click it and Unblock the Notifications











