సూర్య కి దిమ్మతిరిగే రేంజ్ లో షాక్ ఇచ్చిన వర్మ...
తమిళ హీరో సూర్యకి షాక్ తగిలిందట..అదీ ఇప్పుడు కాదు 'రక్తచరిత్ర" సినిమా కోసం వర్మ, సూర్యని 'మద్దెలచెరువు" సూరి పాత్ర కోసం ఎంపిక చేసినప్పుడట. త్తరలో విడుదలకు సిద్ధమవుతోన్న 'రక్తచరిత్ర" గురించి మాట్లాడుతూ, వర్మ సినిమాలో అవకాశమనగానే ఎగిరి గంతేశాననీ, ఆ తర్వాత అనంతపురం ఫ్యాక్షనిజం గురించి తెలుసుకుని షాక్ తిన్నానని సూర్య చెప్పుకొచ్చాడు.
ఫ్యాక్షన్ రాజకీయాలు అన్ని చోట్లా వుంటాయనీ, ఒక్కోచోట ఒక్కో పేరుతో అలాంటి తగాదాలు పాపులర్ అవుతుంటాయనీ, అయితే తానెప్పుడూ అనంతపురం ఫ్యాక్షనిజం రేంజ్ రక్తపాతం వినలేదని, చూడలేదని సూర్య అంటున్నాడు. కథ వినాగానే షాక్ కి గురయ్యాను..ఫ్యాక్షన్ గురించి వర్మ తనకు ఇచ్చిన సమాచారం చదివాక ఆశ్చర్యపోయాను..సినిమాలో నటించేటప్పుడు మరింత ఉద్వేగానికి లోనయ్యాను..సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు సూర్య. బాలీవుడ్ కోలీవుడ్, టాలీవుడ్ ఇలా ఈ మూడు భాషల్లో విడుదలవుతోన్న రక్తచరిత్రపై ఇప్పటికే సినీ వర్గాల్లో అంచనాలు భారీ రేంజ్ లో నెలకొన్న సంగతి విదితమే.


Click it and Unblock the Notifications











