twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ సినిమాతో ‘అప్పల్రాజు’కి మోతే...

    By Sindhu
    |

    తెలుగు సినిమాని ఏకిపారేయడానికే వర్మ 'అప్పల్రాజు" సినిమా తీస్తున్నాడా..?అంటే కాదనే వారెవరూ వుండరు. అందుక్కారణం, 'అప్పల్రాజు" సినిమా ప్రారంభోత్సవం రోజే, సినిమాపైన సెటైర్లు వేస్తూ వర్మ రూపొందించిన పాటే. ఆ పాటతోనే 'అప్పల్రాజు" సినిమాని తానెందుకు రూపొందిస్తున్నాడో చెప్పకనే చెప్పాడు వర్మ. అయితే, 'నా సినిమాలో హీరో పాత్ర అలాంటిది.. నేనెవరిమీదా సెటైరికల్ గా సినిమా తీయడంలేదు.." అంటూ వర్మ ఆ తర్వాత ఎన్నిసార్లు ఎంతగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా, వర్మ అసలు ఉద్ద్యేశ్యమేంటో మరోమారు స్పష్టమైపోయింది.

    'అప్పల్రాజు" సినిమా పాటల్లో ఒక్కో పాటని ఒక్కోసారి విడుదల చేస్తోన్న వర్మ, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఐదోపాటను విడుదల చేశాడు. ఆ పాటలో, సినిమా పబ్లిసిటీ కోసం దర్శక నిర్మాతలు చెప్పే కల్లబొల్లి కబుర్లును ప్రస్తావించారు. ఫట్ మన్న సినిమాని టాలీవుడ్ లో చరిత్ర సృష్టించే సినిమాగా పేర్కొనడం..ఓ అనామక హీరోని స్టార్ హీరో స్థాయికి ఎదిగిపోతానని పొగిడేయడం..ఎంటర్ టైన్ మెంట్..యాక్షన్ మిక్సింగ్..అంటూ పసలేని వ్యాఖ్యలు చేయడం..వారం ఆడని సినిమాని హండ్రెడ్ డేస్ అనడం..థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం కోసం చెత్త సినిమాకి ఆఫర్లు ప్రకటించడం ఇవన్నీ ఓ రేంజ్ లో తెలుగు సినిమా పరిశ్రలో చాలా మంది క్యారెక్టర్లను మడతెట్టేసేలానే ఉన్నాయి.

    ప్రారంభోత్సవం రోజు విన్సించే పాటదేముంది..?ఈ ఐదో పాట సృష్టించే వివాదం అంతా ఇంతా కాదనీ..ఇదంతా సునీల్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందనీ అప్పుడే టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. సంచలనాల వర్మ, టాలీవుడ్ ని ఏకిపారేయడం బావుందిగానీ, సినిమాలో మేటర్ లేకపోతే రివర్స్ వర్మని టాలీవుడ్ ఏకిపారేయడం మాత్రం ఖాయం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X