హిట్ లో ఉన్న యంగ్ హీరోలకి ఫ్లాప్ ఇవ్వడమే వర్మ పనా..!
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ టాక్ ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. హిట్ లో ఉన్న వాళ్ళకి ప్లాప్ లు ఇవ్వడం రామ్ గోపాల్ వర్మకే చెల్లిందన్నదే ఆ ప్రచారం. ఎందుకంటే 'మర్యాద రామన్న" సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న సునీల్ ని వెంటనే హీరోగా పెట్టి రామ్ గోపాల్ వర్మ 'కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: అప్పల్రాజు" లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చాడు. ఆరకంగా సునీల్ కెరీయర్ తో ఆడుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.
తాజాగా నాగచైతన్య ఆ ఖాతాలో చేరాడు.వివేక్ కృష్ణ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'బెజవాడ" మొన్న విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. నాగ చైతన్య నటించిన ఏ మాయ చేసావే, 100% లవ్ వంటి లవ్ స్టోరీ సినిమాలతో విజయం సాధించిన సాధించాడు. తరువాత దడ వంటి యాక్షన్ సినిమా నిరాశ పరిచినా మళ్లీ అదే టైపు యాక్షన్ సినిమా 'బెజవాడ" తో మన ముందుకు వచ్చాడు.
అప్పట్లో నాగార్జునకు 'శివ" చిత్రం ఎలాగో ఇప్పుడు నాగచైతన్యకు 'బెజవాడ" అలా అవుతుందని చాలా మంది ఊహించారు. కానీ ఆ అంచనాలు తలక్రిందులు అయ్యాయి. ఇప్పుడిప్పుడే పై కొస్తున్న నాగచైతన్యలాంటి హీరోకి ప్లాప్ సినిమా పడటం అనేది అతని కెరియర్ కి మైనస్ గా చెప్పొచ్చు. మొత్తానికి రామూతో పెట్టుకుంటే అంతే సంగతులు అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











