»   » నాకు అడ్డు తగులుతున్న దుష్ట శక్తులకి సపోర్ట్ ఇవ్వండి: వర్మ

నాకు అడ్డు తగులుతున్న దుష్ట శక్తులకి సపోర్ట్ ఇవ్వండి: వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ఏ పని చేసినా అతన్నివివాదం వెంటాడుతూనే ఉంటుంది.. కాదు కాదు వివాదాలు సృష్టించడానికే అతను ఏ పనయినా చేస్తాడు. ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్ తో వార్తల్లో నానడం వర్మకి బాగా ఇష్టం అనేది అతని మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఈ మధ్య వర్మ స్టార్ట్ చేసిన బెజవాడ రౌడీలు కూడా అలాంటి వివాదాలే ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ మధ్య విజయవాడలో ఈ చిత్రానికి సంబందించి చిత్రీకరించిన ఓ సన్నివేశం జనం ఉలిక్కిపడేలా చేసి టైటిల్ మార్చే పరిస్థితి ఏర్పడింది..

కాగా తన ట్విట్టర్ లో తాజాగా ఇలా వ్రాశాడు...'హైదరాబాద్ కన్నా బెజవాడ నా నిజమైన పుట్టినిల్లు..ఎందుకంటే బెజవాడలో నేను సినిమా డైరెక్షన్ నేర్చుకొన్నాను..నేను నా మొదటి సినిమా 'శివ" నుంచి ఇప్పటి వరకు అసలు ఏమైనా సాధించానంటే అది కేవలం బెజవాడమూలానే. నేను అంతాగా ప్రేమించే బెజవాడని నేనెందుకు బ్యాడ్ గా చూపెడతానని ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు వినటంలేదు. నాది నిజమనిపిస్తే నా టైటిల్ కి అడ్డు తగులుతున్న ఆ దుష్ట శక్తులకి ఎదురుగా సపోర్ట్ ఇవ్వమని బెజవాడ ప్రజలకి నా విజ్ఞప్తి... అని షడన్ గా ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు...

English summary
Telugu cinema director Ram Gopal Varma suddenly turned philosophical rather than his conventional on his latest Telugu movie Bejawada Rowdilu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X