'వరుడు' హీరోయిన్ భానుశ్రీ మెహ్రా వింత భాధ
అల్లు అర్జున్ వరుడు చిత్రం భాక్సాపీస్ వద్ద మొదటి షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుందని దర్శక, నిర్మాతలు భోరు మంటూంటే, అందులో చేసిన హీరోయిన్ భానుశ్రీ మెహ్రా కి మరో వింత భాధ పట్టుకుంది. అందరికంటే తానే ఎక్కువ నష్టపోయానని ఆమె సన్నిహితుల వద్ద వాపోతోందని తెలుస్తోంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో,గుణశేఖర్ లాంటి దర్శకుడు అని ఎన్నో ఆసలు పెట్టుకున్న తనను రిలీజ్ రోజు దాకా దాచి పెట్టి నష్టపరిచారంటోంది. అంత హైప్ చేసి రిలీజ్ చేసిన తర్వాత తన పాత్రకు ఒరిగిందేమీ లేదని, తనను ఒక్కరు కూడా ఆఫర్ కోసం సంప్రదించలేదని కన్నీళ్లు పెట్టుకుంటోంది. చాలా సినిమాలు వర్కవుట్ కాకపోయినా అందులో హీరోయిన్స్ ని ఇండస్ట్రీ గుర్తించి అవకాశాలు ఇవ్వటం పరిపాటి. అయితే ఇక్కడ పోస్టర్స్ పై గానీ, నెట్లో కానీ, మీడియాకు కానీ ఆమె ఫోటోలు రానివ్వకుండా చేయటంతో అస్సలు ఆమె ఎవరన్నది ఇండస్ట్రీలో ఎవరికీ తెలియని పరిస్ధితి వచ్చేసింది. అలాగే సినిమాలో సైతం తనను ఎక్కడా పెద్ద గ్లామర్ గా చూపించలేదని,పేరుకు హీరోయిన్ అనే గానీ ఆ పాత్ర ఎక్కవ లెంగ్త్ లేదని రకరకాలుగా కామెంట్స్ చేస్తోందని అంటున్నారు. భాను మెహ్రా గతంలో ముంబైలో మోడల్ గా చేసింది. మళ్ళీ తన పాత వృత్తికే వెళ్ళిపోవాలని ఆమె ప్లాన్ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications











