'వరుడు' వద్దంటున్న మహేష్?

By Staff

Mahesh Babu
త్రివిక్రమ్,మహేష్ కాంబినేషన్ లో 'వరుడు' వచ్చే అవకాశాలు లేవని పరిశ్రమలో వార్తలు వినపడుతున్నాయి. అలాగని ప్రాజెక్టు ఆగుతుందని కాదట. త్రివిక్రమ్ చెప్పిన కథ,కథనాలు తన ఇమేజ్ కి నప్పేలా లేవని మహేష్ భావిస్తున్నాడుట. అందుకే ఆ కథని మార్చమంటే త్రివిక్రమ్ వండిన దాన్ని ప్రక్కన పెట్టి మరోదాన్ని రెడీ చేస్తున్నాడుట. అది అప్పట్లో యమ్.యస్.రాజు బ్యానర్ లో మహేష్ చెయ్యటానికి చెప్పిన కథ 'హరే రామ హరే కృష్ణ' కావచ్చంటున్నారు. మరి ఈ విషయం మహేష్ మొదటే కథ విన్నప్పుడే చెప్పవచ్చు కదా అంటే మార్పులు సూచించాడని కానీ అవి కథనంలో ఇమడటం లేదని త్రివిక్రమ్ చెప్పాడని తెలుస్తోంది.

అందులోనూ 'వరుడు' కోసం హీరోయిన్ ని వెతికే సమయంలో మహేష్ ఖాళీగా ఉండి కథ గురించి కాస్త ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆయన దగ్గరవారు అంటున్నారు. అందులోనూ త్రివిక్రమ్ సబ్జెక్టు పూర్తిగా కామిడీగా ఉందని...ప్రస్తుత పరిస్ధితిల్లో అంత లైటర్ వీన్ కథ చెయ్యచ్చా ...యాక్షన్ ఎపిసోడ్లు ఉండాలని మహేష్ శ్రేయాభిలాషులతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. మరో ప్రక్క సమ్మర్ పెద్ద సినిమాలన్నీ బోల్తా కొట్టడం పరిశ్రమలో అందరినీ ఆలోచింప చేస్తున్నట్లుంది. దాంతో అందరూ కథలపై కుస్తీలు పట్టాలని నిర్ణయించుకుంటున్నారు.

ఆ క్రమంలోనే మహేష్ కథ మార్చాలనే నిర్ణయం తీసుకున్నాడని సీనియర్లు చెపుతున్నారు. అన్నీ సక్రమంగా కుదిరితే ఈ సినిమా ఆగష్టు చివరలో పట్టాలెక్కచ్చంటున్నారు. అయితే ఈ రకంగా మళ్ళీ వాయదా పడితే 2009 సమ్మర్ దాకా సినిమా రిలీజ్ అయ్యే ఉండే అవకాశం ఉండదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X