పెళ్లయిన యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బుట్టబొమ్మ

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరిగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు వీడ్కోలు పలికి వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. కొందరు సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతనితో కొద్దిరోజులుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటం ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచ్‌లో ఆ నటుడితో కనిపించి తమ బంధంపై హింట్ ఇచ్చింది బుట్టబొమ్మ. ఆ హీరో ఎవరు? నిజంగానే పూజా హెగ్డే ప్రేమలో పడిందా? ఈ వివరాల్లోకి వెళితే..

పట్టుదలతో స్టార్ హీరోయిన్‌గా
మోడలింగ్ నుంచి సినీరంగంలో అడుగుపెట్టిన పూజా హెగ్డే .. స్టార్ హీరోయిన్ కావడానికి ఎంతో శ్రమించారు. తొలి రోజుల్లో ఆమె నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో ఐరెన్ లెగ్ అనిపించుకున్నారు. అయితే పట్టుదలతో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్‌గా తన లక్ష్యాన్ని అందుకున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, దళపతి విజయ్ వంటి స్టార్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్‌ సరసన ఆమె నటించిన జన నాయగన్ విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా హై జవానీ తో ఇష్క్ హోనా హై, కాంచన 4తో పాటు దుల్కర్ సల్మాన్ సరసన ఓ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు.

Varun Dhawan and Pooja Hegde enjoyed the IPL 2026 sparked speculation about dating Rumours

పలువురితో పూజ డేటింగ్
అయితే 35 ఏళ్లు నిండుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు పూజా హెగ్డే. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి పలువురితో ఈ ముద్దుగుమ్మ ఎఫైర్స్ నడిపినట్లుగా పలుమార్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌తో పాటు బిగ్‌‌బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమాయణం సాగించారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. రోహన్‌తో పూజ పెళ్లి వరకు వెళ్లారని బీటౌన్ టాక్. తాజాగా బుట్టబొమ్మ మరోసారి ప్రేమలో పడినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోతో బుట్టబొమ్మ డేటింగ్?
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో ఆమె ఎఫైర్ సాగిస్తున్నట్లుగా గత కొన్నాళ్లుగా రూమర్లు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీలో జంటగా నటిస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నాటి నుంచి ఈ జంట చాలా క్లోజ్‌గా ఉంటోంది. కొద్దిరోజుల క్రితం వరుణ్ , పూజా ఇద్దరూ తమ చేతులతో హార్ట్ సింబల్ చూపిస్తూ ఉన్న ఫోటో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రిషికేష్‌లోని పరమార్ధ నికేతన్ ఆశ్రమాన్ని సందర్శించి జంటగా ప్రత్యేక పూజలు నిర్వహించి, రుద్రాక్ష మొక్కను నాటి గంగా హారతి ఇచ్చారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం నిజమే అనడానికి ఈ ఫోటో బలాన్ని చేకూరుస్తోంది.

హీరోతో కెమెస్ట్రీ సూపర్
డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ షూటింగ్ ప్రస్తుతం రిషికేష్‌లోని గంగా నదీ తీరంలో జరుగుతోంది. వరుణ్, ధావన్‌లపై కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా షూటింగ్‌కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్‌ తాలూకా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రిషికేశ్ బీచ్‌లో పూజా స్విమ్ సూట్‌లో.. వరుణ్ స్టైలీష్ లుక్‌లో ఉండగా.. వరుణ్ ఒడిలో కూర్చొని పూజా రొమాన్స్ చేస్తున్నారు. ఇవి చూసినవారు వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ ఓ రేంజ్‌లో ఉందని చెబుతున్నారు.

ఐపీఎల్‌లో ప్రత్యక్షమైన జంట
షూటింగ్‌కి బ్రేక్ దొరికితే చాలు.. పూజా హెగ్డే - వరుణ్ ధావన్‌లు జంటగా కనిపిస్తున్నారు. తాజాగా మరోసారి వీరిద్దరూ దొరికిపోయారు. ఏప్రిల్ 12న జరిగిన ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఈ జంట తళుక్కున మెరిసింది. వరుణ్ సెల్ఫీ వీడియో తీస్తుండగా.. పూజా హెగ్డే టోపీతో తన ఫేస్ కవర్ చేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. అలాగే మ్యాచ్‌కు ముందు, ఆ తర్వాత పూజా హెగ్డేను అభిమానుల తాకిడి నుంచి కాపాడుతూ జాగ్రత్తగా కారెక్కించారు వరుణ్ ధావన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరి నిజంగానే పూజా హెగ్డే- వరుణ్ ధావన్ ప్రేమలో పడ్డారా? లేక సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తున్నారా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

భార్యతో వరుణ్‌ బంధంపై అనుమానాలు?
అయితే వరుణ్ ధావన్‌కు ఇప్పటికే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌తో పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. అయితే భార్యతో వరుణ్ విడిపోతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇద్దరివి వేర్వేరు రంగాలు కావడంతో పాటు పలు కుటుంబ కార్యక్రమాలకు వీరిద్దరూ దూరంగా ఉండటం అనేక అనుమానాలు కలిగించాయి. అయితే వీటిని ఈ దంపతులు ఖండించారు.

Read more about: varun dhawan pooja hegde IPL 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X